E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

Today Horoscope in Telugu: ఆ రాశి ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 14వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పొందుతారు. వాహన సంభంధిత వ్యాపారాలు రాణిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. 

వృషభం

Advertisement

కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందుతారు. 

మిథునం

నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో దృష్టి సారించడం మంచిది. కీలక వ్యవహారాలలో బద్దకించడం మంచిది కాదు. కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.

కర్కాటకం

Advertisement

దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో నిదానంగా వ్యవహారించాలి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. దైవ చింతన పెరుగుతుంది. మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

సింహం

దైవ కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. 

కన్య

సోదరులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహయం అందుతుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

వృశ్చికం

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బందులు తప్పవు. 

ధనుస్సు

ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట వివాదాలు పరిష్కరించుకుంటారు.  

మకరం

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. 

కుంభం

దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.

మీనం

గృహ నిర్మాణ పనులలో అవరోధాలుంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.  నూతన రుణాలు చేయడం మంచిది కాదు. వ్యాపారస్థులకు గందరగోళ పరిస్థితులుంటాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×