Nagavamsi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో సూర్యదేవర నాగ వంశీ ఒకరు. నిర్మాతగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన నాగ వంశీ గత ఏడాది పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలన్నీ కూడా పూర్తిగా ఈయనని నిరాశ పరిచాయి. అంతేకాకుండా ఈ సినిమాల విషయంలో నాగవంశీ ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఇకపోతే ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా నాగ వంశీ నిర్మాణంలో నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నాగ వంశీ (Nagavamsi) మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సంక్రాంతికి రాబోయే ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. సోగ్గాడే చిన్నినాయనా, అల… వైకుంఠపురములో, సంక్రాంతికి వస్తున్నాం.. ఇలాంటి అన్ని ఎలిమెంట్స్‌ని కలిపి ఈ సినిమా ద్వారా చూపించబోతున్నామని, మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు అనుకుంటున్నామంటూ నాగ వంశీ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ సినిమా కోసం కచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్ కి వచ్చి ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేయడమే కాకుండా సినిమాని సక్సెస్ చేయాలని, గత కొద్దిరోజులుగా మనల్ని ఎక్కుతున్న వాళ్లందరికీ సమాధానం చెబుదాం… గట్టిగా థియేటర్స్‌కి రండి అంటూ మాట్లాడారు. అలాగే కాలర్ ఎగరేయడం గురించి కూడా ఈయన మాట్లాడుతూ మనం ఇప్పుడు కాలర్ ఎగరేయడాలు ఏమీ వద్దు మే నుంచి కాలర్ ఎగరేయడం మొదలుపెడదాం అంటూ నాగ వంశి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే మే నుంచి కాలర్ ఎగరేద్దాం అంటూ ఈయన చెప్పడంతో కచ్చితంగా ఎన్టీఆర్(NTR) సినిమాకు సంబంధించిన అప్డేట్ అప్పుడు రాబోతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక మే నెలలో ఎన్టీఆర్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ తోనే గాడ్ ఆఫ్ వార్..
ఇలా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే గాడ్ ఆఫ్ వార్(God Of War) సినిమాకు సంబంధించిన ప్రకటన రాబోతుందని ఈ సందర్భంగా నాగ వంశీ చెప్పకనే చెప్పేశారు. ఇక గాడ్ ఆఫ్ వార్ సినిమా నానితో చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలకు నాగ వంశీ ఇలా చెక్ పెట్టారనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి అయిన అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది.
Also Read: Actress Ramya: మగాళ్లను కుక్కలతో పోల్చిన నటి.. ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న నెటిజన్స్!