BigTV English

Tekkali Duvvada Srinivas Warning: అడ్డంగా దొరికిన టెక్కలి వైసీపీ అభ్యర్థి.. దువ్వాడా.. మజాకా…?

Tekkali Duvvada Srinivas Warning: అడ్డంగా దొరికిన టెక్కలి వైసీపీ అభ్యర్థి.. దువ్వాడా.. మజాకా…?

Tekkali Duvvada Srinivas Warning: శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ గురించి చిన్న పరిచయం. ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై విమర్శలు గుప్పించడానికి ఈయన రంగంలోకి దిగుతారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన దువ్వాడ, కాసింత కంటతడి పెట్టాడు. ఆ సమయంలో అచ్చెన్నాయుడిపై ఆయన చేసిన ఆరోపణలకు ఫిదా అయిపోయిన సీఎం జగన్, దువ్వాడ శ్రీనివాస్‌కు వెంటనే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు.


సీన్ కట్ చేస్తే..  తాజాగా  టెక్కలి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. ఈసారి వాలంటీర్లను బెదిరించారు. ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలేం జరిగిందనే లోతుల్లోకి వెళ్తే.. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, వాలంటీర్లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అంతేకాదు రాజీనామాలు చేసిన వాలంటీర్లు వైసీపీ కండువా కప్పుకుని పార్టీ తరపున ప్రచారం చేయాలన్నారు. అలా చేయని వాలంటీర్లను జూన్ ఐదు నుంచి విధుల్లో తీసుకోమని బెదిరించారు. అంతేకాదు వారికి డైడ్‌లైన్ కూడా విధించారు. మే మూడులోపు వాలంటీర్లు రాజీనామా చేయాలని, ఆ రోజు నుంచి పదిరోజులపాటు వైసీపీకి ప్రచారం చేయాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. అలా చేయనివాళ్లు తమకు అవసరం లేదని, వారిని తొలగిస్తామని బెదిరింపులకు దిగారు. వారి స్థానంలో మరొకరిని నియమిస్తామని మనసులోని మాట చెప్పేశారు.


Also Read: రాష్ట్రంలో 30 వేల మంది ఆడబిడ్డల తాళిబొట్టు తెంచారు: చంద్రబాబు

దీనికి సంబంధించి వీడియోను టీడీపీ షేర్ చేసింది. దువ్వాడ వ్యవహారశైలిని తప్పుబట్టింది. జగన్ అసలు రంగు ఇదని, మీరు ఎంత బెదిరించినా వాళ్లు రాజీనామా చేయరని తెలుగుదేశం తెలిపింది. రాబోయే టీడీపీ ప్రభుత్వంలో వారికి వేతనం పెంచడమేకాదు, స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి వారి భవిష్యత్తు తీర్చిదిద్దేలా చంద్రబాబు, పవన్ కృషి చేస్తారని వెల్లడించింది.

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×