E-Paper
Advertisement

SRH vs RCB IPL 2024 Match Preview: హైదరా‘బాదుడు’మళ్లీ మొదలవుతుందా? నేడు ఆర్సీబీతో మ్యాచ్

SRH vs RCB IPL 2024 Match Preview: హైదరా‘బాదుడు’మళ్లీ మొదలవుతుందా? నేడు ఆర్సీబీతో మ్యాచ్
Advertisement

SRH vs RCB Dream11 Prediction IPL 2024: ఐపీఎల్ సీజన్ 2024లో హైదరాబాద్ కొడుతున్న స్కోర్లు చూస్తుంటే అందరికీ మతిపోతోంది. తమ రికార్డులను తామే తిరగరాస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు సాధిస్తున్న జట్టుగా హైదరాబాద్ సరికొత్త రికార్డులను స్రష్టిస్తోంది. ఈ క్రమంలో అరవీర భయంకరంగా కనిపిస్తున్న హైదరాబాద్ ముందు పతనావస్థలో ఉన్న ఆర్సీబీ తట్టుకుని నిలబడుతుందా? అనే ప్రశ్నలు అందరిలో ఉదయిస్తున్నాయి.

సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ నేడు హైదరాబాద్ లో రాత్రి 7.30కి ప్రారంభం కానుంది.

Advertisement

ఇంతవరకు 7 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ 5 గెలిచి, రెండు ఓడిపోయింది. మొత్తానికి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 8 మ్యాచ్ లు ఆడి ఒక్కటే గెలిచి, 7 ఓడిపోయిన ఆర్సీబీ  ఆఖరి స్థానంలో ఉంది.

ఈ రెండు జట్ల మధ్య  ఇప్పటివరకు 24 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో హైదరాబాద్ 13 సార్లు, బెంగళూరు 10 సార్లు విజయం సాధించాయి. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.

Advertisement

Also Read: కొహ్లీ ఓపెనర్ గా రావాలి.. సౌరభ్ గంగూలి 

హైదరాబాద్ గురించి చెప్పాలంటే ఐపీఎల్ 2024 సీజన్ లో దుమ్ము రేపుతోంది. 287 పరుగులతో ఐపీఎల్ లోనే హయ్యస్ట్ పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. అంతకుముందు 277 పరుగులు చేసింది. మరో మ్యాచ్ లో 266 పరుగులు చేసింది.

నేడు జరగనున్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లోనే 287 పరుగుల భారీ స్కోరు సాధించడం విశేషం. అయితే ఆర్సీబీ తక్కువ తినలేదు.  262 పరుగులు చేసి, విజయానికి 25 పరుగుల దూరంలో ఆగిపోయింది.

మరి ఇంత భారీ స్కోరు నమోదు చేసి ఐపీఎల్ లోనే చరిత్ర స్రష్టించిన హైదరాబాద్ పై బెంగళూరు పగ తీర్చుకుంటుందా? దెబ్బకు దెబ్బా తీర్చుకుంటుందా? మళ్లీ చేతులెత్తేస్తుందా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే విరాట్ కొహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్ ఇద్దరూ చెలరేగితే భారీ స్కోరు సాధించడం పెద్ద విషయం కాదని అంటున్నారు. మరోవైపు నుంచి హైదరాబాద్ బ్యాటర్లలో ప్రమాదకరంగా పరిణమించిన ట్రావిస్ హెడ్ ను నిలువరించడంపై కూాడా ఆర్సీబీ ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. మొత్తానికి నేడు హోరాహోరీ తప్పదని అంటున్నారు.

Tags

Related News

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

Big Stories

Advertisement
×