Big Stories

Patanjali Ads Case: పతంజలి ఓకే.. మిగిలినవాటి సంగతేంటి?

Ramdev’s New Apology Bigger Than Before After Supreme Court knock: బూస్ట్‌ తాగితే సిక్స్.. హర్లీక్స్‌ తాగితే అడుగు పొడవు. బోర్న్‌ వీటా తాగితే బరువు. అబ్బో ఇలా చెప్పుకుంటే పోతా చాంతాడంత ఉంది లిస్ట్. ఒక్కోక్కరిది ఒక్కో స్కీమ్.. అందరి టార్గెట్ ప్రజలను బుట్టలో వేసుకోవడం. దందా చేసుకోవడం.. కానీ అన్నిసార్లు అనుకున్నట్టు జరగదు కదా.. దానికి పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్.. పతంజలి యాడ్స్ బాగోతం. ఇష్టంవచ్చినట్టు యాడ్స్‌ ఇచ్చి ఇప్పుడు నానా తంటాలు పడుతుంది. అయినా సుప్రీంకోర్టు కరిగిపోవడం లేదు.. కరుణించడం లేదు.

- Advertisement -

ఈ రోజు న్యూస్ పేపర్స్ చూశారా ఒక్కో మెయిన్‌పేపర్ ఫస్ట్ పేజీలో 25 పర్సెంట్ ఓ యాడ్ కనిపించింది. అన్‌ కండిషనల్ పబ్లిక్‌ అపాలజీ అంటూ ఓ యాడ్ ఇచ్చింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు అందరినీ క్షమాపణలు కోరుతున్నాం. ఇలాంటి మిస్టెక్స్ రిపీట్ చేయడం.. ఇకపై నిబద్ధతగా ఉంటాం. ఇదీ ఆ యాడ్ సారాంశం. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు దేశంలోని అన్ని భాషల్లో ఈ యాడ్ వచ్చింది. సో మొత్తానికి పతంజలి ఆచార్య బాలకృష్ణ, రాందేవ్‌ బాబా పూర్తిగా దిగొచ్చారు. మరీ సుప్రీంకోర్టు ఇప్పటికైనా ఈ అపాలజీని యాక్సెప్ట్ చేస్తుందా? లేదా? అనేది బిగ్ క్వశ్చన్.. ఇలా యాడ్ ఇవ్వడానికి ముందు కూడా చాలా తతంగం నడిచింది. ఇప్పుడే కాదు గతంలో చాలా సార్లు సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది పతంజలి యాజమాన్యం. మిస్‌ లీడ్ చేసే యాడ్స్ భారీగా ప్రకటించి.. హోర్డింగ్‌లు పెట్టారు. క్షమాపణలేమో కోర్టుకు చెప్తే సరిపోతుందా? అంటూ చీవాట్లు పెట్టింది.

- Advertisement -

Also Read: బదిలీలు మేలా? చేటా?

దీంతో బహిరంగంగా క్షమాపణలు చెప్పింది పతంజలి యాజమాన్యం. కానీ అది సరిపోదని.. ప్రకటనలు ఎలాగైతే తాటికాయంత అక్షరాలతో ఇచ్చారో.. అదే స్టైల్‌లో క్షమాపణలు చెప్పాలంది. దీంతో పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ క్షమాపణలు కోరుతూ.. పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో ప్రకటనలు ఇచ్చింది. అయితే ఈ యాడ్‌పై కూడా అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. ఈ క్షమాపణ ప్రకటన.. గతంలో మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఇచ్చిన ప్రకటనల పరిమాణంలోనే ఉందా? అంటూ క్వశ్చన్ చేసింది. 67 న్యూస్ పేపర్స్‌లో యాడ్స్ ఇచ్చినట్టు కంపెనీ కోర్టుకు తెలిపింది. ఆ క్లిప్పింగ్స్ అన్ని కట్ చేసి కోర్టుకు హ్యాండోవర్ చేయాలని చెప్పింది ధర్మాసనం.

ప్రజలను మిస్‌ లీడ్‌ చేసేది ఒక్క పతంజలి మాత్రమేనా.. కానే కాదు.. ఈ దందాలో ఇప్పటి వరకు ఇలా అడ్డంగా బుక్కైంది ఒక్క పతంజలి మాత్రమే.. కానీ ఫోకస్ చేస్తే ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. లైక్.. కోల్గేట్, హార్లిక్స్.. బోర్న్ విటా, బూస్ట్, పాన్ మసాలాలు, వాటర్ కంపెనీలు. ఇలా చాలానే ఉన్నాయి. పతంజలి మీద పిటిషన్ వేసింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. కానీ అదే IMA అప్రూవ్ చేస్తున్నట్టుగా కోల్గెట్ కంపెనీ యాడ్స్ ఇస్తుంది. ఒక్క కోల్గేట్ మాత్రమే కాదు.సెన్సోడైన్, పెప్సిడెంట్.. ఇలా చాలానే ఉన్నాయి. ఒక్కసారి తోమండి.. పళ్లు తలాతలా ఏషియన్ పెయింట్స్‌తో వేసినట్టు మెరిసిపోతాయి. మీ పళ్లల్లో ఉప్పు ఉందా? మా పేస్ట్‌లో బొగ్గు ఉంది. ఇలా ప్రతిదీ మిస్‌లీడ్ చేసే యాడే ఎక్కడో స్క్రీన్‌పై మూలకు.. కనిపించి కనిపించకుండా.. ఊహాజనిత దృశ్యమని చిన్నగా కనిపిస్తుంది.
అసలు రూల్స్ ప్రకారం హాస్పిటల్స్, మందులు, డాక్టర్లు కమర్షియల్ యాడ్స్ ఇవ్వకూడదు ప్రకటనలు చేయకూడదు. మరి మన ఇంట్లోని టీవీ స్క్రీన్స్‌పై వారు కనిపిస్తూనే ఉన్నారు ? మరి ఇవి కూడా మిస్‌లీడ్ చేసే యాడ్స్ కిందకే వస్తాయి కదా.

లెటెస్ట్‌గా క్యాట్బరి బోర్న్‌ వీటాపై మీద కేంద్రం ఓ డెసిషన్ తీసుకుంది. అన్నిరకాల ఇ-కామర్స్ సైట్స్, పోర్టళ్లు తక్షణం బోర్న్‌విటాను హెల్త్ డ్రింక్స్ కింద సూచించడాన్ని నిలిపివేయాలంది. మరి ఎనర్జీ డ్రింక్స్ మాటేమిటీ.. మౌంటెన్‌ డ్యూ, థమ్స్‌ అప్, స్ప్రైట్, మజా.. ఇలా చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. మా డ్రింక్ తాగండి.. మీకు కొండలపై దూకేంత డేర్ వస్తుంది. ఇలా సాగిపోతాయి ఈ యాడ్స్.. హార్లిక్స్, కాంప్లాన్ మీద కూడా అనేక కాంట్రవర్సీలున్నాయి. ప్రత్యేకించి వాటిల్లోని షుగర్ కంటెంట్ మీద రీసెంట్‌గా నెస్లే భాగోతం చూశాం కదా. చిన్నారుల ప్రొడక్ట్స్‌లో షుగర్‌ కంటెంట్‌ను ఎలా మిక్స్ చేస్తుందో.

Also Read: వై దిస్ విద్వేషం.. ప్రధాని నరేంద్రమోడీ వివాదస్పద వ్యాఖ్యలు..

ఇవన్నీ ఒకెత్తు అయితే లిక్కర్‌, గుట్కాలపై ఇచ్చే యాడ్స్‌ మరో ఎత్తు.. మద్యం, గుట్కాలపై యాడ్స్‌ ఇస్తే కేంద్రం యాక్షన్ తీసుకుంటుంది. సో ఆ కంపెనీలు సోడా, వాటర్‌ పేరుతో.. గుట్కా కంపెనీలు పాన్‌ మసాలా పేరుతో యాడ్స్ ఇస్తున్నాయి. చిన్న పిల్లాడికి కూడా తెలుసు అవి వేటిని ప్రమోట్ చేస్తున్నాయో. కానీ చర్యలు మాత్రం తీసుకోరు. కింగ్ ఫిషర్‌ వాటర్.. బ్లెండర్ స్ప్రైడ్ సోడా.. ఇక బాలీవుడు హీరోలు డైరెక్ట్‌గా ప్రమోట్ చేస్తారు.. ప్రధాన గుట్కా, తంబాకు కంపెనీలను. ఒక్కో యాడ్‌లో ముగ్గురు ముగ్గురు హారోలు కూడా ఉంటారు. వాటి బిజినెస్‌ ఏ రేంజ్‌లో లేకపోతే ఇంత భారీ తారాగణాన్ని రంగంలోకి దింపుతారు.

మరి వీటిపై చర్యలేవి.. ఎప్పుడు తీసుకుంటారు? ఎవరో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తే కానీ ఈ విషయాలు బయటికి రావడం లేదు. చర్యలు తీసుకోవడం లేదు. మరి కేంద్రం నిద్ర పోతుందా? లేక నటిస్తుందా? లేక లోపాయికారి ఒప్పందాలతో సైలెంట్ అవుతున్నారా? పతంజలి అంశం సుప్రింకోర్టు దృష్టికి వచ్చింది కాబట్టి.. కంపెనీ నిర్వాకాన్ని బట్టలిప్పి బజార్లో నిలబెట్టింది. మరి ఇతర కంపెనీల విషయాల్లో కూడా కోర్టు జోక్యం చేసుకునే వరకు కేంద్రం ఇలానే ఉంటుందా? ముందే మేల్కోంటుందా? ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోతుంది. సో కేంద్రం ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రజలను కాపాడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News