Big Stories

Hyd, Kmm, Knr candidates: తెలంగాణ బరిలో కొత్త ముఖాలు, రాజకీయ ఫ్యామిలీ నుంచి..

Telangana congress party news(TS today news): ఎట్టకేలకు తెలంగాణలోని పెండింగ్‌లో ఉన్న మూడు లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ వలీవుల్లా సమీర్, ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రఘురామిరెడ్డి, కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే జగపతిరావు కుమారుడు రాజేందర్‌రావు ఖరారు చేసింది. ఎన్నికల నామినేషన్‌కు గురువారం చివరిరోజు కావడంతో నామినేషన్లు వేయనున్నారు.

- Advertisement -

తొలుత ఖమ్మం అభ్యర్థి రఘురామిరెడ్డి విషయానికొద్దాం. ఖమ్మం ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ పార్టీ కీలక నేతల నుంచి గట్టి పోటీ ఎదురైంది. అభ్యర్థిని ఎంపిక చేయడం కాంగ్రెస్ హైకమాండ్‌‌కు కత్తి మీద సాముగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన భార్య నందిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్‌కు టికెట్ ఇవ్వాలని కోరారు. దీనికి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ పలుమార్లు చర్చించి చివరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రఘురామిరెడ్డి పేరు ఖరారు చేసింది.

- Advertisement -

కాంగ్రెస్ రాజకీయ దిగ్గజం రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డి. వీరి సొంతూరు ఖమ్మం జిల్లా పాలేరు. సురేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగు సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఆయన కొడుకే రఘురామిరెడ్డి. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పలు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్‌గా, హైదరాబాద్ రేస్ క్లబ్ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. రఘురామిరెడ్డి చిన్న కుమారుడు అర్జున్‌రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డితో వివాహమైంది.

కరీంనగర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు ఫాదర్ జగపతిరావు కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. తాత కేశవరావు కాంగ్రెస్‌లో కీలకనేతగా ఉండేవారు. ఇక రాజేందర్‌రావు గురించి ముఖ్యమైన అంశాలు చూద్దాం. సింగిల్ విండో ఛైర్మన్, కరీంనగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. టీఆర్ఎస్, ప్రజారాజ్య పార్టీల్లోనూ పని చేశారు. పోచంపాడు కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ఎండీగా ఉన్న రాజేందర్‌రావు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ALSO READ: చేవెళ్ల బరిలో ‘పొలిమేర’ నటి, అందుకే పోటీ

ఇక హైదరాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి మహ్మద్ వలీవుల్లా సమీర్ టోలీచౌకీలో ఉంటున్నారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. అంతేకాదు మీడియా రంగంలో ఆసక్తితో ఇండియన్ న్యూస్ నెట్ వర్క్‌ పేరిట ఛానెల్‌ను స్థాపించారు. ఆరేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, అంచెలంచెలుగా పార్టీలో ఎదిగారు. నెల కిందట హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News