E-Paper
Advertisement

SA VS AFG Double Super Over: టీ20 ప్ర‌పంచ క‌ప్ లో డ‌బుల్ సూప‌ర్ ఓవ‌ర్‌..ఎవ‌రు గెలిచారంటే

SA VS AFG Double Super Over: టీ20 ప్ర‌పంచ క‌ప్ లో డ‌బుల్ సూప‌ర్ ఓవ‌ర్‌..ఎవ‌రు గెలిచారంటే
Advertisement

SA VS AFG Double Super Over: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు 12 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇక ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ( South Africa vs Afghanistan) జట్ల మధ్య 13వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ( Narendra Modi Stadium, Ahmedabad) నిర్వహించారు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఎవరు ఊహించని సంఘటన జరిగింది. రెండు సూపర్ ఓవర్లు ( Double Super Over) ఆడాల్సి వచ్చింది దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు. మొదట దక్షిణాఫ్రికా విధించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా రాణించింది. దీంతో రెండు జట్ల స్కోర్ ఈక్వల్ అయింది. దీంతో మొదటి సూపర్ ఓవర్ ఆడాల్సి వ‌చ్చింది. అప్పుడు కూడా మ్యాచ్ టై అయ్యింది. దీంతో రెండో సారి కూడా సూపర్ ఓవర్ ఆడాయి దక్షిణాఫ్రికా అలాగే ఆఫ్ఘనిస్తాన్. కానీ రెండో సూప‌ర్ ఓవ‌ర్ లో మాత్రం సౌతాఫ్రికా ఇర‌గ‌దీసింది. ఆఫ్ఘనిస్తాన్ ను ఓడించి గెలిచింది.

Also Read: PAK VS USA: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై అనుమానాలు…USAపై పాకిస్తాన్ విజ‌యం, సూప‌ర్ 8లోకి ఎంట్రీ !

టి20 ప్రపంచ కప్ లో డబుల్ సూపర్ ఓవర్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో డబుల్ సూపర్ ఓవర్ ( SAvAFG Double Super Over
) చోటు చేసుకుంది. మొదటి సూపర్ ఓవర్స్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 17 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా కూడా అద్భుతంగా రాణించింది. ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan) విధించిన 17 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో గట్టిగానే పోరాడింది సఫారీ జట్టు. దీంతో మొదటి సూపర్ ఓవర్ లో ఇద్దరికీ సమానంగా పరుగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఇక రెండవ సూపర్ ఓవర్ లో దక్షిణాఫ్రికా 23 పరుగులు సాధించింది. 6,1,2,6,6,2 ఇలా వరుసగా సఫారీ జట్టు రాణించింది.

దీంతో 23 పరుగులు వచ్చాయి. అయితే ఈ 23 పరుగులు ఛేదించే క్ర‌మంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా మ‌రిసారి ఇర‌గ‌దీసింది. వ‌రుస‌గా రెహ్మానుల్లా గుర్బాజ్ వ‌రుస‌గా సిక్సులు కొట్టాడు. కానీ చివ‌రి బంతికి 5 ప‌రుగులు కావాల్సిన స‌మ‌యంలో రెహ్మానుల్లా గుర్బాజ్ ఔట్ అయ్యాడు. దీంతో 5 ప‌రుగుల తేడాతో ఆఫ్ఘ‌నిస్తాన్ పై విజ‌యం సాధించింది సౌతాఫ్రికా. ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మొదటి బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్ణీత 20 ఓవర్లు ఆడింది దక్షిణాఫ్రికా. ఈ నేపథ్యంలోనే ఆరు వికెట్లు నష్టపోయిన దక్షిణాఫ్రికా 187 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అద్భుతంగా రాణించింది. కానీ 19.4 ఓవర్లు ఆడిన ఆఫ్ఘనిస్తాన్… 187 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

Advertisement

Also Read: Bhanuka LibraryRajapaksa: ఇండియ‌న్‌ బ్యాట్ల‌లో రబ్బ‌ర్లు, అందుకే భ‌యంక‌రంగా ఆడుతున్నారు..విషం క‌క్కిన శ్రీలంక ప్లేయ‌ర్‌

 

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×