E-Paper
Advertisement

Abhishek Sharma : పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు ఎదురు దెబ్బ‌..ఆ విధ్వంస‌క‌ర ప్లేయ‌ర్ ఔట్ ?

Abhishek Sharma : పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు ఎదురు దెబ్బ‌..ఆ విధ్వంస‌క‌ర ప్లేయ‌ర్ ఔట్ ?
Advertisement

Abhishek Sharma : టీమిండియా కి టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఎదురుదెబ్బ త‌గిలిందనే చెప్పాలి. ముఖ్యంగా టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆసుప‌త్రి పాల‌య్యాడు. క‌డుపు కి సంబంధించిన‌ ఇన్ఫెక్ష‌న్ తో అత‌ను బాధ‌ప‌డుతున్నాడు. దీంతో న‌మీబియాతో జ‌రుగ‌నున్న టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ కి దూరం కానున్నాడు. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ కు అందుబాటులో ఉంటాడా..? లేదా అనేది అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి, ట్రీట్ మెంట్, రీక‌వ‌రి పై ఆధార‌ప‌డి ఉంది. గురువారం న‌మీబియాతో జ‌రిగే గ్రూప్ ద‌శ మ్యాచ్ కి ముందు యూఎస్ఏతో జ‌రిగిన మ్యాచ్ స‌మ‌యంలోనే అభిషేక్ శ‌ర్మ అనారోగ్యానికి గురైన‌ట్టు స‌మాచారం. ఇక అదే స‌మ‌యంలో అత‌నికి డ్రిప్స్ అవ‌స‌రం అయ్యాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రిగిన ప్రాక్టీస్ కు కూడా అభిషేక్ శ‌ర్మ హాజ‌రు కాలేదు. అమెరికాతో జ‌రిగిన మ్యాచ్ లో అత‌ను గోల్డెన్ డ‌కౌట్ కావ‌డం గ‌మ‌నార్హం.

Also Read : IPL 2026 – RCB: ఆర్సీబీకి స్టేడియం లేకుండా చేసిన‌ అంబానీ..ఇక విశాఖ‌లో RCB మ్యాచ్ లు !

రెండు రోజుల్లో..

Advertisement

యూఎస్ఏ- టీమిండియా మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ స‌మ‌యంలోనే అభిషేక్ అనారోగ్యానికి గుర‌య్యాడు అభిషేక్ శ‌ర్మ‌. ఇక ఆ మ్యాచ్ ఆడిన త‌రువాత అత‌ని ప‌రిస్థితి మ‌రింత విష‌మించింది. తీవ్ర జ్వ‌రంతో బాధ ప‌డ్డాడు. ఇక అదే స‌మ‌యంలో క‌డుపునొప్పి, ఇన్పెక్ష‌న్ బారిన ప‌డ్డాడు. అత‌నికి డ్రిప్స్ అవ‌స‌రం అయ్యాయి. ముఖ్యంగా యూఎస్ఏతో జ‌రిగిన మ్యాచ్ లో అత‌ను గోల్డెన్ డ‌కౌట్ గా వెనుదిరిగాడు. అత‌ని స్థానంలో సంజు శాంస‌న్ ఫీల్డింగ్ చేశాడు. జ‌ట్టు విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ పోస్ట్ మ్యాచ్ హ్యాండ్ షేక్స్ స‌మయంలో కూడా అభిషేక్ శ‌ర్మ క‌నిపించ‌లేదు ఎందుకు అని అంద‌రూ ఆరా తీశారు. అభిషేక్ శ‌ర్మ ఆరోగ్య ప‌రిస్థితి పై అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్ ఛేట్ మీడియాతో కూడా మాట్లాడాడు. క‌డుపు సంబంధిత ఇబ్బందుల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు నిర్థారించారు. రెండు రోజుల్లో కోలుకుంటాడ‌ని.. న‌మీబియాతో మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడ‌ని ఆశిస్తున్న‌ట్టు తెలిపారు

అదే ఫామ్ కొన‌సాగిస్తే..

. వాస్త‌వ ప‌రిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. క‌డుపు ఇన్ఫెక్ష‌న్ తో అత‌ను ఏకంగా ఆసుప‌త్రిలో అడ్మిట్ కావాల్సి వ‌చ్చింది. క‌డుపు ఇన్ఫెక్ష‌న్ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చేరిన‌ట్టు స‌మాచారం. కొన్ని ప‌రీక్ష‌లు కూడా జ‌రుగుతున్నాయ‌ని బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కానీ డిశ్చార్జ్ ఎప్పుడో అనేది ఇంకా స్ప‌ష్టం కాలేద‌ని.. న‌మీబియాతో మ్యాచ్ ఆడ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. పాకిస్తాన్ తో జ‌రిగే మ్యాచ్ లో క‌చ్చితంగా అభిషేక్ శ‌ర్మ ఆడాల‌ని అభిమానులు కోరుతున్నారు. అభిషేక్ శ‌ర్మ పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడ‌క‌పోతే టీమిండియా కి క‌ష్ట‌కాలం ఎదుర‌వుతుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. టీమిండియా త‌ర‌పున ఇటీవ‌ల జ‌రిగిన ఏసియా క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ అద్భుతంగా రాణించాడు. అదే ఫామ్ కొన‌సాగిస్తే.. టీమిండియా విజ‌యం గ్యారెంటీ అని ప‌లువురు పేర్కొన్న త‌రుణంలో ఇప్పుడు అభిషేక్ శ‌ర్మ అనారోగ్యం పాలు కావ‌డంతో టీమిండియా కి క‌ష్టకాలం మొద‌లైంది. అత‌ని స్థానంలో సంజు శాంస‌న్ ఆడే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

Advertisement

Also Read : Trolls on Usman Tariq: ఐసీసీ కళ్లు మూసుకుపోయాయా ? ఉస్మాన్ తారిక్ పై బ్యాన్ వేయండి..USA, శ్రీలంక ఫ్యాన్స్ ట్రోలింగ్‌

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×