E-Paper
Advertisement

T20 world cup 2026: చెమ‌ట‌లు ప‌ట్టిస్తోన్న ప‌సికూన‌లు..టీమిండియా, పాక్ లాంటి జ‌ట్ల‌కు చుక్క‌లు చూపించారు

T20 world cup 2026: చెమ‌ట‌లు ప‌ట్టిస్తోన్న ప‌సికూన‌లు..టీమిండియా, పాక్ లాంటి జ‌ట్ల‌కు చుక్క‌లు చూపించారు
Advertisement

T20 world cup 2026: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ( T20 World Cup 2026 tournament) కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్న నేపథ్యంలో.. పసికూన జట్లు తగ్గేదేలే అంటున్నాయి. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో మూడు రోజుల్లో 9 మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఇందులో చిన్న జట్లు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. నేపాల్, నెదర్లాండ్స్, స్కాట్లాడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్ , నమీబియా లాంటి క్రికెట్ జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి.

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

పెద్ద జట్లకు చుక్కలు చూపిస్తున్న పసికూనలు

Advertisement

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో పసికూన జట్లు అదరగొడుతున్నాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభంలో పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది నెదర్లాండ్స్. కానీ కొద్దిలో ఓడిపోయింది. లేకపోతే పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిపోయేది. ఆ తర్వాత వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చివరి వరకు వచ్చి పోరాడి ఓడిపోయింది స్కాట్లాండ్.

ఇక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు ( USA) అందరూ తక్కువ అంచనా వేశారు. కానీ డిపెండింగ్ ఛాంపియన్ అయిన టీమిండియా కే మూడు చెరువుల నీళ్లు తాగించింది అమెరికా. ఈ మ్యాచ్ లో టాపాటా మొత్తం కుప్పకూలింది. కానీ సూర్యకుమారు యాదవ్ ఒక్కడే మ్యాచ్ చివరి వరకు తీసుకువెళ్లాడు. అయితే సూర్య కుమార్ యాదవ్ ఒక్కడు ఆడకపోయి ఉంటే ఇండియా పై అమెరికా జట్టు గెలిచేది. ఈ మ్యాచ్ కూడా హైలెట్ గా నిలిచింది. అటు మొన్న న్యూజిలాండ్ పైన ఆఫ్గనిస్తాన్ చివరి వరకు పోరాడి ఓడింది.

Advertisement

ఈ టోర్నమెంట్లో నేపాల్ ఫైటింగ్ అద్భుతం. క్రికెట్ కనిపెట్టిన ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించింది. ఈ మ్యాచ్లో చివర వరకు పోరాడిన నేపాల్ కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లాండ్ పైన నేపాల్ గెలిచి ఉంటే సరికొత్త చరిత్ర సృష్టించేది. ఇక స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ కూడా అద్భుతంగా సాగింది. ఇందులో పోరాడి స్కాట్లాండ్ విజయం సాధించింది. ఈ విధంగా ఈ టోర్నమెంట్లో ప్రతి మ్యాచ్ లో కూడా పసికూన జట్లు అద్భుతంగా రానిస్తున్నాయి.

ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య ఫైట్

ఇండియన్ ఓడించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు ఇవాళ పాకిస్తాన్ తో తలపడనుంది. ఈ రెండు దట్ల మధ్య ఇవాళ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ కు కొత్త టెన్షన్ మొదలైంది. టీమిండియానే ఓడించేందుకు ప్రయత్నించిన అమెరికా జట్టు… ఇప్పుడు పాకిస్తాన్ ను కూడా ఓడిస్తుందని అందరూ అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే అమెరికా జట్టు నుంచి సవాళ్ళు వస్తున్నాయి. మరి ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టును పాకిస్తాన్ ఎలా తట్టుకుంటుందో చూడాలి.

Also Read: Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

 

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×