T20 World Cup 2026 Final: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) ఫైనల్ మ్యాచ్ ఎల్లుండి మార్చి 8వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్, టీమిండియా ( India vs New Zealand) తలపడతాయి. రెండో సెమీ ఫైనల్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా ( Team India).. నిన్న ఫైనల్స్ లోకి దూసుకు వచ్చింది. దీంతో న్యూజిలాండ్ తో ( New Zealand) ఫైనల్ ఆడేందుకు సిద్ధమైంది టీమిండియా. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ( Narendra Modi Stadium, Ahmedabad ) టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ మేరకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Also Read: T20 World Cup 2026: శ్రీలంకలో ఆ పాకిస్తాన్ ప్లేయర్ అరాచకాలు…హోటల్ పని మనిషిపై లైంగిక దాడి !
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మార్చి 8వ తేదీన న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఒకవేళ రద్దు అయితే ఎవరు విజేత అని చర్చ జరుగుతోంది. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ కు మార్చి 8వ తేదీన వర్షం పడితే… రిజర్వుడే కచ్చితంగా ఉంటుంది. అంటే మార్చి 8వ తేదీన ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో, అక్కడి నుంచే రిజర్వ్ డే రోజున ( Reserve Day) మ్యాచ్ ప్రారంభిస్తారు. ఇక ఆ రిజర్వుడే రోజున కూడా… వర్షం పడితే మాత్రం టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ విజేత ఎవరనేది ఇప్పుడు చర్చ.
అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం… రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ జరగకుండా రద్దు అయితే, సంయుక్తంగా టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ టైటిల్ ను పంచుకోవాలి. అంటే 2026 టి20 వరల్డ్ కప్ ట్రోఫీని ఇండియా, న్యూజిలాండ్ రెండు జట్లు పంచుకుంటాయి. ఈ టోర్నమెంట్ విజేతలుగా న్యూజిలాండ్, టీమిండియా రెండు కూడా నిలుస్తాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటుంది ఐసీసీ. ఇప్పుడు ఇదే రూల్ టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటుకు ( T20 World Cup 2026 tournament ) కూడా వర్తిస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మార్చి 8వ తేదీన న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( New Zealand vs Team India ) మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే ఆ రోజున వర్షం పడే ఛాన్సు లేదని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి ఫలితం కచ్చితంగా తేలనుంది.
India and New Zealand are set to clash in yet another ICC final as the two teams face off in the T20 World Cup 2026 final in Ahmedabad. #INDvsENG #INDvsNZ #SuryakumarYadav #T20WorldCup2026 pic.twitter.com/2ysQIyVckv
— CricTracker (@Cricketracker) March 5, 2026