E-Paper
Advertisement

West Indies vs South Africa: వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా భారీ విక్ట‌రీ…టీమిండియా సెమీస్ రూట్ క్లియ‌ర్

West Indies vs South Africa: వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా భారీ విక్ట‌రీ…టీమిండియా సెమీస్ రూట్ క్లియ‌ర్
Advertisement

West Indies vs South Africa: టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  నేపథ్యంలో టీమిండియా కు అదిరిపోయే శుభవార్త అందింది. అందరూ కోరుకున్నట్లుగానే వెస్టిండీస్ పైన దక్షిణాఫ్రికా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో టీమ్ ఇండియా సెమీ ఫైనల్ రూట్ క్లియర్ అయింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ ( West Indies vs South Africa)  మధ్య సూపర్ 8 మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad)  వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించి, వెస్టిండీస్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. అయితే ఇందులో దక్షిణాఫ్రికా గెలవడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం కానుంది. దక్షిణాఫ్రికా విజయం సాధించిన నేపథ్యంలో టీమిండియా సెమీ ఫైనల్ రూట్ క్లియర్ అయింది. ఇక ఇవాళ జింబాబ్వేపై టీమిండియా ( Team India) విజయం సాధిస్తే, పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానానికి దూసుకు వెళ్తుంది. ర‌న్ రేట్ కూడా పెరుగ‌నుంది. అప్పుడు వెస్టిండీస్ వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇదే ఊపులో ఇండియా మరో విజయం సాధిస్తే సెమీ ఫైనల్ కు చేరుకుంటుంది.

Also Read: Gautam Gambhir: ఎవ్వ‌డికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిల మైకంలోనే ఉంటున్నారు.. డ్రెస్సింగ్ రూంలో క్లాస్ పీకిన గంభీర్‌

టీమిండియా సెమీ ఫైన‌ల్ చేరాలంటే ?

Advertisement

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వెస్టిండీస్ పై దక్షిణాఫ్రికా గెలవడం టీమిండియా కు అడ్వాంటేజ్ గా మారింది. ఒకవేళ ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ గెలిస్తే, టీమిండియా సెమీఫైనల్ ఛాన్సులు మరింత కష్టతరం అయ్యేవి. అయితే, దక్షిణాఫ్రికా విజయం సాధించడంతో వెస్టిండీస్ రెండవ స్థానానికి వెళ్ళింది. మూడో స్థానంలో ఉన్న టీమిండియా, ఇవాళ జింబాబ్వే పై గ్రాండ్ విక్టరీ కొట్టాలి. జింబాబ్వే పై గ్రాండ్ విక్టరీ కొడితే, నెట్ రన్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. అదే సమయంలో టీమిండియా పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి వెళుతుంది. ఇక వెస్టిండీస్ పైన చివరి మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్ వెళ్తుంది..

Also Read: Salman Agha: నీ పెళ్లాన్ని రేప్ చేస్తాం, కొడుకును చంపేస్తాం…పాక్ కెప్టెన్ స‌ల్మాన్ ఫ్యామిలీకి వేధింపులు

వెస్టిండీస్ పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో వెస్టిండీస్ పై భారీ విజయం నమోదు చేసింది దక్షిణాఫ్రికా. సూపర్ 8 లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. వెస్టిండీస్పై విజయం సాధించిన దక్షిణాఫ్రికా నేరుగా సెమీ ఫైనల్ కు దూసుకువెళ్లింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలోనే 8 వికెట్లు నష్టపోయిన వెస్టిండీస్ 176 పరుగులు సాధించింది. అటు ఈ లక్ష్యాన్ని 16.1 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది దక్షిణాఫ్రికా.

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×