T20 World Cup Semi Final Schedule: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) సెమీ ఫైనల్ ( Semi Final ) దశకు వచ్చేసింది. మార్చి 4వ తేదీ నుంచి ఈ సెమీఫైనల్ పోరు షురూ కానుంది. ఇప్పటికే నాలుగు జట్లు సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. టీమిండియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా అలాగే ఇంగ్లాండ్ జట్లు ఇప్పటికే సెమీ ఫైనల్ లో అడుగుపెట్టాయి. నిన్న వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా ( Team India vs West Indies ) మధ్య మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ సేన అద్భుతంగా రానించి సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది. దీంతో నాలుగు జట్లు సెమీ ఫైనల్ కు వచ్చినట్లు అయింది. ఇలాంటి నేపథ్యంలో టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ సెమీఫైనల్ షెడ్యూల్ వైరల్ గా మారింది.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ రేసు ( T20 World Cup Semi Final Schedule ) మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మార్చి 4వ తేదీన దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ ( South Africa vs New Zealand, 1st Semi-Final) మధ్య తొలి సెమీ ఫైనల్ జరుగుతుంది. కోల్కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens, Kolkata) వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. రాత్రి 7:00 సమయంలో మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
ఇక రెండో సెమీ ఫైనల్ లో ఇండియా అలాగే ఇంగ్లాండ్ జట్లు ( England vs India, 2nd Semi-Final,) తలపడతాయి. ముంబైలోని వాంఖాడే స్టేడియం ( Wankhede Stadium, Mumbai) వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది. మార్చి 5వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో ఈ మ్యాచ్ ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సెమీఫైనల్ పోరు మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు ఈ సెమీఫైనల్స్ జరుగుతాయి. అయితే ఈ సెమీఫైనల్స్ కు వర్షం విలన్ గా మారితే పరిస్థితి ఏంటి అని చర్చ జరుగుతోంది. వర్షం పడితే రిజర్వ్ డే ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. మార్చి 4వ తేదీన వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే.. మార్చి 5వ తేదీన కూడా ఆ మ్యాచ్ కొనసాగుతుంది. మార్చి ఐదవ తేదీన జరిగే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారితే ఆరవ తేదీన కూడా రిజర్వు డే ఉంటుంది. రిజర్వ్ డే రోజు కూడా ఫలితం తేలక పోతే… నెట్ రన్ రేట్ ప్రకారం ఫైనల్ కు వెళతాయి జట్లు. దక్షిణాఫ్రికా ఇటు ఇంగ్లాండ్ రెండు జట్లు కూడా ఫైనల్ కు చేరుతాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 8వ తేదీన ఉంటుంది.
🚨 HISTORIC 2026 T20I WC SEMIS 🚨
• 🏴 England (Europe)
• 🇿🇦 South Africa (Africa)
• 🇳🇿 New Zealand (Oceania)
• 🇮🇳 India (Asia)…..See more pic.twitter.com/wUNYTi500x— lndian Sports Netwrk (@IS_Netwrk29) March 2, 2026