E-Paper
Advertisement

India vs West Indies: సంజూ ర‌ఫా..ర‌ఫా, వెస్టిండీస్ పై 10 ఏళ్ల రివేంజ్ తీర్చుకున్న టీమిండియా…సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ

India vs West Indies: సంజూ ర‌ఫా..ర‌ఫా, వెస్టిండీస్ పై 10 ఏళ్ల రివేంజ్ తీర్చుకున్న టీమిండియా…సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ
Advertisement

India vs West Indies: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఆదివారం రోజున వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs West Indies ) మధ్య సూపర్ 8 మ్యాచ్ జరిగింది. కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా, నేరుగా సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ( Eden Gardens, Kolkata) జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టును చిత్తు చేసింది టీమిండియా. చాలా రోజుల తర్వాత ఫామ్ లోకి వచ్చిన సంజు శాంసన్ 97 ప‌రుగులు చేసి, తన సత్తా ఏంటో చాటాడు. భయంకరమైన ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియాను సెమీ ఫైనల్ కు చేర్చాడు. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ 195 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా. కేవ‌లం 19.2 ఓవ‌ర్ల‌లో వెస్టిండీస్ విధించిన ల‌క్ష్యాన్ని ఛేదించింది టీమిండియా. ఈ విజ‌యంతో సెమీస్ లోకి అడుగు పెట్టింది టీమిండియా.

Also Read: Fakhar Zaman : పాకిస్తాన్ తో శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్‌..లైవ్ మ్యాచ్ లోనే అండంగా దొరికిపోయారు, ఇదిగో వీడియో

వెస్టిండీస్ పై పదేళ్ల రివెంజ్ తీర్చుకున్న టీమిండియా

Advertisement

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ జట్టుపై కీలక మ్యాచ్ లో విజయం సాధించింది టీం ఇండియా. ఇందులో విజయం సాధించడమే కాదు తన పది సంవత్సరాల పగను తీర్చుకుంది సూర్య కుమార్ యాదవ్ సేన. 2016 సమయంలో టీ20 ప్రపంచ కప్ జరగగా.. అప్పుడు ముంబై వేదికగా వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియాను చిత్తు చేసి ఫైనల్ కు చేరుకుంది వెస్టిండీస్. అయితే అప్పటి పగను… పది సంవత్సరాల తర్వాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా తీర్చుకుంది సూర్య కుమార్ యాదవ్ సేన. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా కనిపిస్తున్నారు.

సంజూ ర‌ఫా..ర‌ఫా, వెస్టిండీస్ పై 10 ఏళ్ల రివేంజ్ తీర్చుకున్న టీమిండియా

టి20 ప్రపంచక 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 195 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో టీమిండియా చేదించింది. దీంతో సెమీఫైనల్ లో అడుగు పెట్టింది సూర్య కుమార్ యాదవ్ సేన. అయితే చేజింగ్ లో టీమిండియా తరఫున బరిలోకి దిగిన సంజు శాంసన్ ఊచ కోత కోశాడు. ప్రతిసారి విఫలమవుతున్నాడని అందరూ అతన్ని పొడుస్తూ ఉంటే.. అసలు సిసలు మ్యాచ్ లో కాక రేపాడు. వెస్టిండీస్ పైన కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు సంజు శాంసన్. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. ఏమాత్రం తగ్గలేదు. మహేంద్ర సింగ్ ధోని వారసుడిలా చెలరేగిపోయాడు సంజు. దీంతో చివరలో బౌండరీ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. ఈ దెబ్బకు టీమిండియా సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

Also Read: US Israel Iran War: టీ20 వ‌రల్డ్ క‌ప్ పై వార్ ఎఫెక్ట్..గ‌జ గ‌జ వ‌ణికిపోతోన్న ప్లేయ‌ర్లు..రంగంలోకి ఐసీసీ

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×