E-Paper
Advertisement

India vs West Indies: విండీస్ ఫ‌స్ట్ బ్యాటింగ్..ఐసీసీని ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గా మార్చారు…విషం క‌క్కిన పాక్‌

India vs West Indies: విండీస్ ఫ‌స్ట్ బ్యాటింగ్..ఐసీసీని ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గా మార్చారు…విషం క‌క్కిన పాక్‌
Advertisement

India vs West Indies:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మరి కాసేపట్లో వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఏడు గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ టాస్ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. పొగ మంచు రాకుండా పిచ్ సిద్ధం చేసిన నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ సెకండ్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో రింకు సింగ్ కు అవ‌కాశం రాలేదు. అటు ఎప్ప‌టి లాగానే సంజుకు తుది జ‌ట్టులో స్థానం ద‌క్కింది.

Also Read: Fakhar Zaman : పాకిస్తాన్ తో శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్‌..లైవ్ మ్యాచ్ లోనే అండంగా దొరికిపోయారు, ఇదిగో వీడియో

ఐసీసీని ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గా మార్చారు.. పాక్ మాజీ క్రికెటర్ సంచలనం

Advertisement

వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ ( SAQLAIN MUSHTAQ). ఐసీసీని కాస్త ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గా మార్చారని… బీసీసీఐ ప్రపంచ క్రికెట్ ను ఏలుతోందని మండిపడ్డారు. బీసీసీఐ ఏది చెప్పినా, ఐసీసీ అదే ఫాలో అవుతుందని ఆరోపణలు చేశారు. అందుకే టీమిండియా ఇప్పుడు సెమీ ఫైనల్ స్టేజ్ దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయని తెలిపారు. వెస్టిండీస్ పైన కూడా ఇండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇండియాకు అనుకూలంగానే ఈడెన్ గార్డెన్స్ పిచ్ సిద్ధం చేసి ఉంటారని ఆరోపణలు చేశారు సక్లైన్ ముస్తాక్.

దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా 2016 టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ సందర్భంగా టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ముంబై వేదికగా ( Wankhede Stadium, Mumbai) నిర్వహించారు. అయితే ఇందులో ఇండియాను ఓడించిన వెస్టిండీస్ ఫైనల్ కు చేరుకుంది. అద్భుతంగా ఆడిన వెస్టిండీస్ ఫైనల్ దాక వెళ్లి టైటిల్ కూడా గెలుచుకుంది. అయితే అప్పటి పగను ఇప్పుడు టీమిండియా తీర్చుకునే అవకాశం వచ్చింది.

Advertisement

 

టీమిండియా వ‌ర్సెస్ వెస్టిండీస్ జ‌ట్లు వివ‌రాలు

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్(w/c), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డే, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్ర‌వర్తి, జస్ప్రీత్ బుమ్రా

Also Read: US Israel Iran War: టీ20 వ‌రల్డ్ క‌ప్ పై వార్ ఎఫెక్ట్..గ‌జ గ‌జ వ‌ణికిపోతోన్న ప్లేయ‌ర్లు..రంగంలోకి ఐసీసీ

 

 

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×