Hardik vs Gautam Gambhir: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ప్రస్తుతం సూపర్ 8 స్టేజ్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆదివారం రోజున అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగులు తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది సూర్య కుమార్ యాదవ్ సేన. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సూపర్ 8 మ్యాచ్ సందర్భంగా గౌతమ్ గంభీర్ అలాగే హార్దిక్ పాండ్యా మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాను ( hardik pandya ) గౌతమ్ గంభీర్ బూతులు ( gautam gambhir ) తిట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో కూడా బయటకు వచ్చింది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా ఆదివారం కీలక మ్యాచ్ జరిగింది. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( India vs South Africa) మధ్య సూపర్ 8 మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగింది. ఇందులో దక్షిణాఫ్రికా మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా 20 ఓవర్లు ఆడింది దక్షిణాఫ్రికా. ఈ సందర్భంగా ఏడు వికెట్లు నష్టపోయిన దక్షిణాఫ్రికా 187 పరుగులు సాధించింది. ఇందులో డేవిడ్ మిల్లర్ 63 పరుగులు సాధించాడు. స్టబ్స్ 44 పరుగులు సాధించాడు. బ్రెవిస్ 45 పరుగులు చేసి రాణించారు. ఈ నేపథ్యంలోనే భారీ స్కోర్ చేసింది దక్షిణాఫ్రికా. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా దారుణంగా విఫలమైంది. 18.5 ఓవర్లు ఆడిన టీమ్ ఇoడియా, 111 పరుగుల వద్ద కుప్పకూలింది. దీంతో 76 పరుగులు తేడాతో దారుణంగా ఓడిపోయింది టీమిండియా. ఈ ఓటమి నేపథ్యంలో సెమీఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి.
ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా ఫీల్డింగ్ చేస్తోన్న క్రమంలో హర్ధిక్ పాండ్యా, కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. టీమిండియా ఫీల్డింగ్ హర్ధిక్ పాండ్యాను ఏదో అన్నాడు గంభీర్. దానికి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాడు హర్ధిక్ పాండ్యా. ఇక కోపంతో రెచ్చిపోయిన కోచ్ గౌతమ్ గంభీర్, బండ బూతులు తిట్టాడట. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఫోటోలు వైరల్ గా మారాయి.
?utm_source=ig_web_copy_link
Conversation between Hardik Pandya and Gautam Gambhir 👀#INDvsSA #T20WorldCup #HardikPandya pic.twitter.com/IKF2W3qLAW
— Ram Chander (@RamChan64603452) February 23, 2026