E-Paper
Advertisement

Tirumala Ghee Case: తిరుమల లడ్డూ ఇష్యూ.. వైసీపీకి దక్కని ఊరట, స్వామి పిటిషన్ సుప్రీం కొట్టివేత

Tirumala Ghee Case:  తిరుమల లడ్డూ ఇష్యూ.. వైసీపీకి దక్కని ఊరట, స్వామి పిటిషన్ సుప్రీం కొట్టివేత
Advertisement

Tirumala Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో వైసీపీ ముగినిపోయినట్టేనా? ఆ వ్యవహారంలో కూరుకుపోయిన ఆ పార్టీ నేతల భరతం పట్టేందుకు ఏకసభ్య కమిటీ రంగంలోకి దిగేసిందా? కమిటీని ఆపేందుకు వైసీపీ విసిరిన చివరి అస్త్రం ఫెయిలైందా? సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్‌ని న్యాయస్థానం కొట్టివేసిందా? ఇకపై ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేయనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

తిరుమల లడ్డూ ఇష్యూ.. రంగంలోకి ఏకసభ్య కమిటీ

Advertisement

తిరుమల లడ్డూలో రసాయనాల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో సీబీఐ సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏక సభ్య కమిటీని నియమించింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ వ్యవహారం కాస్త వైసీపీలో టెన్షన్ మొదలైంది. తమ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు చంద్రబాబు సర్కార్ పావులు కదుపుతున్నట్లు భావించింది.

ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు సుబ్రమణ్యస్వామి. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మసనం ముందుకు ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. తొలుత స్వామి తన వాదనలు వినిపించారు. రాజ్యాంగ పదవుల్లోని వారు దీనిపై మాట్లాడకుండా నిలువరించాలని వాదించారు.

Advertisement

సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఓవర్ లాపింగ్ కిందకు రాదని తేల్చి చెప్పింది.  పరిపాలనాపరమైన లోపాల గుర్తింపునకు ఏర్పాటు చేసిందని సీజేఐ ధర్మాసనం తేల్చి చెప్పింది. న్యాయస్థానం ఇచ్చిన మార్గ దర్శకాల ప్రకారం.. సీబీఐ సిట్ విచారణ చేసిందని తెలిపింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాజకీయ నేతలు జోక్యానికి ఎలాంటి ఆస్కారం లేదని తేల్చి చెప్పింది.

అదే సమయంలో రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలు కోర్టుకు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది తప్పా, జోక్యం చేసుకునే పరిస్థితి ఎక్కడా ఉండదని పేర్కొంది. న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు జరుగుతోందని, అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని క్లారిటీ ఇచ్చింది.

ALSO READ: వైసీపీ వ్యవహారం.. వంగవీటి ఆశాలత క్లారిటీ, టార్గెట్ ఫిక్సయినట్టే?

నివేదిక తర్వాత బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఏపీ ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీని కొనసాగించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాదనల సమయంలో స్వామి లేవనెత్తిన అన్ని అంశాలను సుప్రీంకోర్టు విముఖత చూపినట్టు చెప్పింది. పిటిషన్ ఏ మాత్రం విచారణ అర్హత లేదని చెబుతూ విచారణను ముగించింది. దీంతో ఏకసభ్య కమిటీ ఇప్పుడు ఏం చేస్తుందన్న చర్చ ఏపీలో మొదలైందా?  దీనిపై లోతుగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

 

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×