E-Paper
Advertisement

Saqlain Mushtaq vs Hafeez: పాతాళానికి తొక్కేసిన‌ ఇంగ్లాండ్..లైవ్ డిబేట్ లో త‌న్నుకున్న పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్లు !

Saqlain Mushtaq vs Hafeez: పాతాళానికి తొక్కేసిన‌ ఇంగ్లాండ్..లైవ్ డిబేట్ లో త‌న్నుకున్న పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్లు !
Advertisement

Saqlain Mushtaq vs Hafeez:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026) నేపథ్యంలో పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. మంగళవారం ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్, సెమీ ఫైనల్ అవకాశాలను కోల్పోయింది. అద్భుతం జరిగితే తప్ప సెమీ ఫైనల్ లో పాకిస్తాన్ అడుగుపెట్టడం కష్టమే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు లైవ్ డిబేట్ లో వాగ్వాదానికి పాల్పడ్డారు. ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకుంటూ రెచ్చిపోయారు. పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాబాద్ ఖాన్ ( Shabad Khan) విషయంలో మహమ్మద్ హ‌ఫీజ్ ( Mohammad Hafeez) అలాగే సక్లైన్ ముస్తాక్ ( saqlain mushtaq ) మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే లైవ్ జరుగుతుండగానే ఇద్దరు ఒకరినొకరు బండ బూతులు తిట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read:  Indian Team Semi final Qualification: టీమిండియా సెమీ ఫైన‌ల్ కు చేరాలంటే ఒక్క‌టే మార్గం..వ‌ర్షం ప‌డాల‌ని కొబ్బ‌రికాయ‌లు కొట్టాల్సిందే

లైవ్ డిబేట్ లో కొట్టుకున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మంగళవారం సూపర్ 8 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ఓడిపోయింది. చివరి వరకు పోరాడిన పాకిస్తాన్, ఇంగ్లాండ్ చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 20 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలోనే తొమ్మిది వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్ 164 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని హ్యారీ బ్రూక్ సెంచరీ తో చెలరేగి చేదించాడు. అయితే, ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయిన సందర్భంగా మాజీ క్రికెటర్లందరూ లైవ్ డిబేట్ లో పాల్గొన్నారు. ఇందులో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్, మహమ్మద్ హఫీజ్, సక్లైన్ ముస్తాక్ లాంటి వాళ్లు ఉన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ నెగిటివ్ పాయింట్లు ఎత్తి చూపే ప్రయత్నం చేశారు మాజీ క్రికెటర్లు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ ఆల్రౌండర్ షాబాద్ ఖాన్ గురించి చర్చ వచ్చింది.

ఇంగ్లాండ్ ను ఓడించేందుకు తన అల్లుడు షాబాద్ ఖాన్ చాలా ప్రయత్నం చేశాడని.. కానీ మిగతా ప్లేయర్లు సహకరించలేదని సక్లైన్ ముస్తాక్ వెల్లడించారు. దీంతో రెచ్చిపోయిన మహమ్మద్ హఫీజ్, షాబాద్ ఖాన్ ప్రదర్శన చెత్తగా ఉందని మండిపడ్డారు. అతడు పేరుకే ఆల్రౌండర్.. కానీ పాకిస్తాన్ జట్టులో ఉండి దండగా అంటూ మండిపడ్డారు. వెంటనే అతన్ని తొలగించాలని కోరారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ముస్తాక్ అలాగే మహమ్మద్ హఫీజ్ మధ్య గొడవ చోటు చేసుకుంది. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సమక్షంలోనే ఈ ఇద్దరు గొడవపడ్డారు. వదిలితే కొట్టుకునేలా కనిపించారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

Advertisement

Also Read: England vs Pakistan: సెంచ‌రీతో ఇర‌గదీసిన బ్రూక్‌, సెమీ ఫైన‌ల్ కు ఇంగ్లాండ్‌..టోర్న‌మెంట్ నుంచి పాకిస్తాన్ ఔట్ !

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×