E-Paper
Advertisement

PAK vs IRE: పాకిస్తాన్ నెత్తిన ద‌రిద్రం తాండ‌వం..శ్రీలంక‌లో భారీ వ‌ర్షాలు, తొలి మ్యాచ్ ఆడ‌కుండానే ఎలిమినేట్ !

PAK vs IRE: పాకిస్తాన్ నెత్తిన ద‌రిద్రం తాండ‌వం..శ్రీలంక‌లో భారీ వ‌ర్షాలు, తొలి మ్యాచ్ ఆడ‌కుండానే ఎలిమినేట్ !
Advertisement

PAK vs IRE:  T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో పాకిస్తాన్ కు కష్టాలు మొదలయ్యాయి. ఇండియాతో మ్యాచ్ బహిష్కరించిన నేపథ్యంలో ఐసిసి హెచ్చరికలు జారీ చేస్తోంది. కోర్టుకు ఈడ్చుకొస్తామని వార్నింగ్ ఇస్తోంది. ఇండియాతో కచ్చితంగా మ్యాచ్ ఆడాల్సిందేనని తేల్చి చెప్పేస్తోంది ఐసీసీ. లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోట్లల్లో ఫైన్ కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ కు ప్రకృతి కూడా సహకరించడం లేదని తెలుస్తోంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభానికి అంటే ముందు అన్ని జట్లు వార్మ‌ప్ మ్యాచులు ఆడుతున్నాయి. అయితే ఫిబ్రవరి 4వ తేదీన పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య కొలంబో వేదికగా వార్మ‌ప్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది.. దీంతో పాకిస్తాన్ కు ఊహించని షాక్ తగిలింది.

Also Read:  Ishan Kishan vs Sanju Samson: సంజు వ‌ర్సెస్ ఇషాన్..టీ20 ప్ర‌పంచ క‌ప్ లో ఓపెన‌ర్ గా ఎవ‌రు బెస్ట్ ? ఇదిగో రికార్డులు

పాకిస్తాన్ కు వరుణుడి గండం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ కు సంబంధించిన మ్యాచ్ లు అన్ని కొలంబో వేదికగా జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే కొలంబోకు వచ్చిన పాకిస్తాన్, బుధవారం రోజున ఐర్లాండ్ తో వార్మ‌ప్‌ మ్యాచ్ ( PAK VS ire warm up match ) ఆడాల్సి ఉంది. కానీ శ్రీలంకలోని కొలంబోలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ తరుణంలో టాస్ పడకుండానే మ్యాచ్ రద్దయింది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో ప్రాక్టీస్ లేకుండానే నేరుగా తొలి మ్యాచ్ ఆడనుంది పాకిస్తాన్.

అయితే ఫిబ్రవరి 7వ తేదీన పాకిస్తాన్ తొలి టి20 ప్రపంచ కప్ మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ దశలో నెదర్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 7వ తేదీన ఉదయం 9 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా మ్యాచ్ ఉంది. అయితే ఈ మ్యాచ్ రోజున 90% వర్షం పడే ప్రమాదం పొంచి ఉందట. ఇదే జరిగితే మ్యాచ్ రద్దు చెరో పాయింట్ లభించే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరి 10వ తేదీన యునైటెడ్ స్టేట్స్ అమెరికాతో పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది.

గ్రూప్ స్టేజ్ లోనే పాకిస్తాన్ ఎలిమినేట్

Advertisement

అందులో గెలిచిన కూడా పాకిస్తాన్ కు పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరించింది పాకిస్తాన్. దాని వ‌ల్ల నెగిటివ్ ర‌న్ రేట్ న‌మోదు అవుతుంది. 2 పాయింట్లు కోల్పోనుంది పాక్‌. అటు ఫిబ్రవరి 18వ తేదీన నమీబియాతో మరో మ్యాచ్ ఆడనుంది పాక్. ఆ రోజు కూడా వర్షం పడితే, పాకిస్తాన్ కు తీవ్ర నష్టం జరుగుతుంది. అంటే వ‌ర్షం కార‌ణంగా పాకిస్తాన్ కు తీవ్ర న‌ష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. ఈ దెబ్బ‌కు సూప‌ర్ 8 చేరుకోకుండానే, గ్రూప్ స్టేజ్ లోనే పాకిస్తాన్ ఎలిమినేట్ అవుతుంద‌న్న మాట‌. అటు ఇండియాతో మ్యాచ్ ఆడ‌కుంటే, కూడా టోర్న‌మెంట్ నుంచి పాకిస్తాన్ ను బ‌హిష్క‌రించ‌నుంది ఐసీసీ.

Also Read: MS Dhoni on Ro-Ko: ఎవ‌డెన్ని డ్రామాలు చేసినా, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో Ro-Ko ఆడ‌తారు..గంభీర్ కు ఇచ్చిప‌డేసిన‌ ధోని!

 

?igsh=aXFjZzltYTI2ZXBr

 

?igsh=MWJ6Y2Y4Zzlycm1saA==

Related News

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×