E-Paper
Advertisement

MS Dhoni on Ro-Ko: ఎవ‌డెన్ని డ్రామాలు చేసినా, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో Ro-Ko ఆడ‌తారు..గంభీర్ కు ఇచ్చిప‌డేసిన‌ ధోని!

MS Dhoni on Ro-Ko: ఎవ‌డెన్ని డ్రామాలు చేసినా, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో Ro-Ko ఆడ‌తారు..గంభీర్ కు ఇచ్చిప‌డేసిన‌ ధోని!
Advertisement

MS Dhoni on Ro-Ko: టీమిండియా జట్టులో రోహిత్ శర్మ ( Rohit Sharma), విరాట్ కోహ్లీ ( Virat Kohli) ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ ఇద్దరు జట్టులో ఉంటే ఎంతటి బలమైన ప్రత్యర్థినైనా ఓడించగలదు టీమిండియా. అయితే అలాంటి రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరూ వన్డే వరల్డ్ కప్ 2027 ( icc world cup 2027 ) టోర్నమెంటులో ఆడడంపై సర్వత్ర టెన్షన్ నెలకొంది. గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) కోచ్ గా ఉంటే వాళ్ళిద్దరూ వన్డే వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ తక్కువగా ఉన్నట్లు చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ( MS Dhoni) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఉంటారని వ్యాఖ్యానించారు. వాళ్ల ఏజ్ పైబడినప్పటికీ, ఫిట్నెస్ చాలా బాగుందని వెల్లడించారు. ఎవరు అవునన్నా.. కాదన్నా వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండాల్సిందేనని తెలిపారు.

Also Read: Ramiz Raja: ప్ర‌ధాని మోడీ క‌నుసైగ చేస్తే, పాకిస్తాన్ క్రికెట్ భూస్తాపిత‌మే..PCBని దేవుడు కూడా కాపాడ‌లేడు !

టీమిండియా అత్యంత బ‌ల‌మైన జ‌ట్టు

Advertisement

టీమిండియా జట్టుకు ( Team India) మూడు ఐసీసీ టోపీలు అందించిన మొనగాడు మహేంద్ర సింగ్ ధోని ( Ms Dhoni). ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న మహేంద్ర సింగ్ ధోని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా కొనసాగుతున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధోని, టీమిండియా జట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పాల్గొనబోయే టీమిండియా జట్టు గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పాల్గొనే 20 జట్టలో ఇండియా అత్యంత ప్రమాదకరంగా ఉందని వ్యాఖ్యరించారు. బ్యాటింగ్ లైనప్అలాగే బౌలింగ్ అద్భుతం అన్నారు. కచ్చితంగా టీమిండియా ప్రపంచక 2026 టోర్నమెంట్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా పరోక్షంగా హింట్ ఇచ్చారు ధోని.

రోకో కాంబినేష‌న్ పై ధోని కామెంట్స్‌

టీమిండియా రోకో ( ROKO) కాంబినేషన్ పైన కూడా స్పందించారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఆడతారని ధీమా వ్యక్తం చేశారు. కుర్ర క్రికెటర్లకు పోటీగా ఆ ఇద్దరు ఆటగాళ్లు దూసుకు వెళ్తున్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు వాళ్లను జట్టు నుంచి తొలగించడం తప్పుడు నిర్ణయమని మండిపడ్డారు. కచ్చితంగా వన్డే వరల్డ్ కప్ లో వాళ్లను తీసుకోవాలని కోరారు. ఆ ఇద్దరి క్రికెటర్ల అనుభవాన్ని టీమిండియా వినియోగించుకోవాలని పేర్కొన్నారు మహేంద్రసింగ్ ధోని. ఎవరిని కుట్రలు చేసినా వాళ్ళిద్దరూ వరల్డ్ కప్ జట్టులో ఉంటారన్నారు ధోని.

Advertisement

Also Read: RCB-Jacqueline Fernandez: శృంగార తార కోసం రూ.8300 కోట్లు..? జైలులో ఉన్న సుకేష్ సంచలన ఆఫర్

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×