E-Paper
Advertisement

Rajamouli : రెమ్యూనరేషన్ ను పెంచేసిన జక్కన్న.. ఒక్కో సినిమాకు ఎన్నికోట్లంటే..?

Rajamouli : రెమ్యూనరేషన్ ను పెంచేసిన జక్కన్న.. ఒక్కో సినిమాకు ఎన్నికోట్లంటే..?
Advertisement

Rajamouli : టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు డైరెక్టర్ రాజమౌళి.. సినిమా చరిత్రలో తనకంటూ మంచి గుర్తింపును, స్టార్ డమ్ ను సంపాదించుకున్న దర్శకుడు ఆయన. ఆయన తెరకెక్కించిన సినిమాలు అన్నీ కూడా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. దాంతో ఆయన మార్కెట్ కూడా బాగానే ఉంది. రాజమౌళి చేసే సినిమాలకు డిమాండ్ ఎలా ఉంటుందో.. రాజమౌళి కూడా అలాంటి డిమాండ్ ఏ ఇండస్ట్రీలో ఉంటుంది. ఈయన ఒక్క సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అన్నది ఎప్పటికీ సస్పెన్స్ గా కొనసాగుతూనే ఉంటుంది. సినిమాలు హిట్ అయిన తర్వాత రెమ్యూనరేషన్ పెంచడం మామూలే. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్లలో రాజమౌళి పేరే మొదటగా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రచారంలో ఉంది. అదేంటంటే జక్కన్న రెమ్యూనరేషన్ పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..

ఒక్క సినిమాకు రూ. 200 కోట్లు.. 

తెలుగు డైరెక్టర్ లలో ఎంతోమంది సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు.. కానీ రాజమౌళి మాత్రం స్పెషల్. ఈయన తర్కి ఎక్కించిన సినిమాలకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ను సొంతం చేసుకున్నాయి. ఇక జక్కన్నతో వచ్చే సినిమాల బడ్జెట్ కూడా ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటుంది. అలాగే రాజమౌళి ఒక్క సినిమాకు తీసుకొనే పారితోషికం కూడా ఎక్కువే.. ప్రస్తుతం ఒక్క సినిమాకు దాదాపు రూ.200 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఆయన కష్టం ఎంతో ఉంది.. అంత రెమ్యూనరేషన్తీసుకోవడానికి ఆయన నుంచి వచ్చిన సినిమాలో సూపర్ హిట్ అవడమే కారణం..

Advertisement

Also Read : మలయాళ నటుడు కోసం ఆ పని చేసిన హీరో.. అల్లు అర్జున్ గ్రేట్ అంతే..

నెక్స్ట్ సినిమాకు రెమ్యూనరేషన్ ను పెంచేశాడా..? 

రాజమౌళి తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు పోటీ పడుతూనే ఉంటారు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి సినిమాని తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా వచ్చేయడాది ఏప్రిల్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీ నుంచి రోజుకు అప్డేట్ బయటకొస్తుంది. దీనిపై అంచనాలు ఎక్కువగా ఉండడంతో సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని అటు మహేష్ బాబు అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు.. ఇకపోతే ఈ మూవీకి రాజమౌళి దాదాపూ 200 కోట్లకు పైగా రెమ్యూన్సరేషన్ తీసుకుంటున్నాడని టాక్. అంతేకాదు ఈ మూవీ లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నాడట.. ఇప్పుడు నెక్స్ట్ మూవీకి పెంచినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ అని చేయబోయే సినిమాకు 250 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మరి దీనిపై రాజమౌళి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×