Tanveer Ahmed On IND VS NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India) మధ్య టీ20 సిరీస్ (India tour of New Zealand 2026 ) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. గురువారం రోజున ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగగా.. అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ సేన నాలుగు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) హాట్ కామెంట్స్ చేశారు. టీమిండియా గెలవడంపై అనుమానాలు వ్యక్తం చేసిన తన్వీర్ అహ్మద్… ఫిక్సింగ్ చేయడం వల్లే ఈ టార్గెట్ చేదించారని బాంబు పేల్చారు. ఫ్లాట్ మైదానాలలో మాత్రమే గెలిచే టీమిండియా, న్యూజిలాండ్ గడ్డపై గెలవడం అసాధ్యమని పరువు తీశారు. టీమిండియా బ్యాటర్ల బ్యాట్లలో స్ప్రింగులు పెట్టి ఉంటారని ఆరోపించారు. దీంతో టీమిండియాపై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India) మధ్య నిన్న జరిగిన మ్యాచ్ పై తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఫ్లాట్ మైదానాలలో మాత్రమే విజయం సాధించే శ్రేయస్ అయ్యర్ సేన… న్యూజిలాండ్ పై గెలవడం అసాధ్యమన్నారు. బీసీసీఐ ఏదో స్కెచ్ వేస్తే తప్ప…అంత సులభంగా గెలవడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ డబ్బులు ఇచ్చిందని ఆరోపణలు కూడా చేశారు.
అంతేకానీ ఈ దద్దమ్మలు విదేశీ గడ్డలపై గెలిచిన సందర్భాలు ఎక్కడ లేవని హేళన చేశారు. ముఖ్యంగా సంజు శాంసన్, నమన్ ధీర్ ఇద్దరి బ్యాట్లలో స్ప్రింగులు కచ్చితంగా ఉన్నాయని కుండబద్దలు కొట్టి చెప్పారు. వీళ్ళ బ్యాట్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చెక్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అప్పుడే భారత జట్టు బండారం బయటపడుతుందని హాట్ కామెంట్స్ చేశారు. ఇలా చేయకుండా ఐసీసీ లైట్ తీసుకుంటే, న్యూజిలాండ్ గడ్డపై అన్ని మ్యాచ్ లు గెలవడం గ్యారెంటీ అని హెచ్చరించారు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( IND VS NZ T20 Series) మ్యాచ్ కూడా హాట్ కామెంట్స్ చేశారు. సంజు ( Sanju samson) అలాగే నమన్ ధీర్ లకు ( naman Dhir) న్యూజిలాండ్ క్రికెటర్లు కావాలనే స్లో బంతులు వేశారని ఆరోపణలు చేశారు. అందుకే టీమిండియా గెలిచిందంటూ బాంబు పేల్చారు. అంతేకానీ టీమిండియాకు గెలిచే దమ్ము లేదని పరువు తీశారు.