
Sunny Leone (Image credit: Instagram)
హాలీవుడ్ నీలి ప్రపంచంలో ప్రపంచ ప్రఖ్యాతిని అందుకున్న సన్నీలియోన్ ఆ తర్వాతి కాలంలో ఆ ఊబి నుంచి బయటకు వచ్చి నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

Sunny Leone (Image credit: Instagram)
వాస్తవానికి ఈమె భారతీయ సంతతికి చెందిన సినీనటి. ఈమె తండ్రి టిబెట్ లో పుట్టిన సిక్కు మతస్థుడైనప్పటికీ ఆయన ఢిల్లీలోనే పెరిగారు. ఈమె తల్లి హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యురాలు. 1981 మే 13న జన్మించిన ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్రా.

Sunny Leone (Image credit: Instagram)
ఈమె జన్మించక ముందే ఈమె తల్లిదండ్రులు కెరడాలో స్థిర పడ్డారు. చిన్నప్పటి నుంచే పాటలు పాడడం, డాన్స్ చేయడం, హార్స్ రైడింగ్ వంటి వాటిలో ప్రావీణ్యం పొందిన ఈమె.. మోడల్ గా ఎదగాలనుకుంది. అందులో భాగంగానే 1999లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీడియాట్రిక్ నర్సుగా శిక్షణ కూడా తీసుకుంది.

Sunny Leone (Image credit: Instagram)
ఇక తర్వాత ఎన్నో ఇబ్బందులు.. ఒడిదుడుకులు ఎదుర్కొని అన్నింటికీ స్వస్తి పలికి సినిమా ఇండస్ట్రీలోకి నటిగా అడుగు పెట్టింది. జిస్మ్ 2 అనే చిత్రం ద్వారా హిందీ పరిశ్రమలోకి నటిగా అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

Sunny Leone (Image credit: Instagram)
కరెంటు తీగ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న సన్నీ లియోన్ పిఎస్వి గరుడవేగ, జిన్నా , మందిర వంటి తెలుగు చిత్రాలలో కనిపించింది.

Sunny Leone (Image credit: Instagram)
ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె.. తాజాగా వైట్ కలర్ లెహంగా ధరించి తన అందాలతో మెస్మరైజ్ చేసింది.. ఈమెను చూసిన అభిమానులు నిజంగా దేవకన్య దిగివచ్చిందేమో అంటూ కామెంట్ చేస్తున్నారు.