Tanveer Ahmed On Tilak Varma: న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (New Zealand vs Team India) మధ్య జరిగిన రెండో టి20 సందర్భంగా అద్భుతమైన అర్థ సెంచరీ సాధించి జట్టును గెలిపించాడు తిలక్ వర్మ. ఈ క్రమంలో నిన్న రాత్రి నుంచి తిలక్ వర్మ (Tilak Varma) పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిసారి ఆదుకుంటున్నాడని తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇలాంటి క్రమంలో తిలక్ వర్మపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) సంచలన వ్యాఖ్యలు చేశారు. తిలక్ వర్మ లాంటి ఆటగాడు ఒక్కడు కూడా పాకిస్తాన్ జట్టులో లేడని ఫైర్ అయ్యారు. అలాంటి ప్రదర్శన చేసే ఆటగాళ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తయారు చేయడంలో విఫలమవుతోందని మండిపడ్డారు. తిలక్ వర్మ కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్నా పాకిస్తాన్ ప్లేయర్లకు సిగ్గు రాదన్నారు. ఇకనైనా తిలక్ వర్మ లాంటి టెక్నిక్స్ నేర్చుకోవాలని దిశా నిర్దేశం చేశారు. దీంతో తిలక్ వర్మపై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20 సందర్భంగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టిన నేపథ్యంలో తన్వీర్ అహ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రన్ చేజింగ్ లో తిలక్ వర్మ మరోసారి మెరిశాడని ఈ ప్రశంసించారు. గతంలో తమ పాకిస్తాన్ జట్టుపై విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడి టీమిండియాను గెలిపించాలని గుర్తు చేశారు. అప్పుడు పాకిస్తాన్ కు పీడకల మిగిల్చాడని వెల్లడించారు. టి20 లలో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు తిలక్ వర్మ అతని స్థానాన్ని భర్తీ చేశాడని తెలిపారు. పాకిస్తాన్ అంటేనే మనోడికి ఊపు వస్తోందని వ్యాఖ్యానించారు.
గతంలో పాకిస్తాన్ జట్టును దెబ్బతీసినట్టుగానే నిన్న న్యూజిలాండ్ బౌలర్లకు నరకం చూపించాడని షాకింగ్ కామెంట్ చేశారు. తీవ్ర ఒత్తిడిలోనూ మ్యాచ్ ఫినిష్ చేయగల సత్తా ఉన్నోడు తిలక్ వర్మ అని ప్రసంగించారు. పాక్ యువ ఆటగాళ్లు తిలక్ వర్మ లాగా బ్యాటింగ్ చేస్తారు కానీ.. చేజింగ్ సమయంలో ఒత్తిడికి లోనవుతున్నారని గుర్తు చేశారు. అలాంటి వాళ్ళు తిలక్ వర్మ రన్ చేజ్ చూసి నేర్చుకోవాలని సూచనలు చేశారు. దానిపైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు దృష్టి పెట్టాలని… కోచుల ద్వారా ప్రత్యేక ట్రైనింగ్ ఇప్పించాలని రిక్వెస్ట్ చేశారు. అప్పుడే తిలక్ వర్మ లాంటి రన్ చేజర్స్ పాకిస్తాన్ జట్టులో పుట్టుకొస్తారని వ్యాఖ్యానించారు.