E-Paper
Advertisement

Tanveer Ahmed: ఇండియ‌న్ క్రికెట‌ర్ల‌కు డ‌బ్బు పొగ‌రు..న‌న్ను న‌మ్మి PSLలోకి హెడ్ వ‌స్తే, బంగారు భ‌విష్య‌త్తు

Tanveer Ahmed: ఇండియ‌న్ క్రికెట‌ర్ల‌కు డ‌బ్బు పొగ‌రు..న‌న్ను న‌మ్మి PSLలోకి హెడ్ వ‌స్తే, బంగారు భ‌విష్య‌త్తు
Advertisement

Tanveer Ahmed :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మే 22వ తేదీన కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ (Travis Head) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన నేపథ్యంలో హెడ్ ను అవమానిస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే విరాట్ కోహ్లీ వెళ్ళిపోయాడు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. దీనిపై విరాట్ కోహ్లీని విలన్ చేస్తూ మాజీ క్రికెటర్లు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు… ఈ అంశంపై స్పందిస్తూ, విరాట్ కోహ్లీని (Virat Kohli ) విలన్ చేస్తున్నారని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ఇలాంటి క్రమంలోనే ఈ సీన్ లోకి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) కూడా వచ్చాడు. భారత క్రికెటర్లకు డబ్బు అహంకారం ఉందని.. అందుకే విదేశీ క్రికెటర్లు అంటే గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

PSLలోకి ట్రావిస్ హెడ్ వ‌స్తే బెట‌ర్

Advertisement

ట్రావిస్‌ హెడ్ వర్సెస్ విరాట్ కోహ్లీ అంశంపై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ సంఘటనలో విరాట్ కోహ్లీది 100కు 200% తప్పిదం ఉందని వ్యాఖ్యానించారు. వెంటనే హెడ్ కు విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. టీమిండియా క్రికెటర్లకు డబ్బు వల్ల అహంకారం విపరీతంగా పెరిగిపోయిందని ఆగ్రహించారు. అందుకే హెడ్ లాంటి అంతర్జాతీయ క్రికెటర్ ను విరాట్ కోహ్లీ అవమానించాడని సీరియస్ అయ్యారు. ఇలాంటి అవమానాల నేపథ్యంలో ఐపీఎల్ టోర్నమెంటును కాదనుకొని పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి హెడ్ వస్తే బాగుంటుందని సూచనలు చేశారు తన్వీర్ అహ్మద్. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో హెడ్ కు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

స్టీవెన్ స్మిత్ కు 14 కోట్లు ఇస్తున్నామని.. హెడ్ వస్తే 20 కోట్ల వరకు ఇచ్చేందుకు ఫ్రాంచైజీలు ముందుకు వస్తాయని బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీనిపై హెడ్ కచ్చితంగా ఆలోచన చేసుకోవాలని కోరారు. ఐపీఎల్ టోర్నమెంట్లో డబ్బు వస్తుంది కావచ్చు, కానీ ఇలాంటి అవమానాలు ప్రతి మ్యాచ్ లో విదేశీ క్రికెటర్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని సంచలన కామెంట్స్ చేశారు. కోహ్లీ ప్రవర్తన వల్ల హెడ్ అవమానాన్ని ఎదుర్కొన్నాడు.. అందుకే IPL ను పక్కకు పెడితే, బీసీసీఐ పరువు అంతర్జాతీయంగా పోతుందని సూచనలు చేశారు.  తన మాట విని, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి వస్తే, అన్ని దగ్గరుండి తానే చూసుకుంటానని భరోసా కూడా కల్పించారు తన్వీర్ అహ్మద్. అయితే దీనిపై హెడ్ ( Travis Head) ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Advertisement

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×