E-Paper
Advertisement

Tanveer Ahmed: క‌ళ్లు మూసుకుని అభిషేక్ శ‌ర్మ‌ బ్యాట్ ఊపుతున్నాడు

Tanveer Ahmed: క‌ళ్లు మూసుకుని అభిషేక్ శ‌ర్మ‌ బ్యాట్ ఊపుతున్నాడు
Advertisement

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో నిన్న అభిషేక్ శర్మ ( abhishek sharma) సెంచరీ తో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హైదరాబాద్ లోని (Sunrisers Hyderabad vs Delhi Capitals) ఉప్పల్ స్టేడియం ( Rajiv Gandhi International Stadium, Hyderabad) వేదికగా బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ, 47 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. దీంతో అభిషేక్ శర్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అయితే అభిషేక్ శర్మ చేసిన సెంచరీ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్నారు.

Also Read: Chris Gayle Controversal Comments ON PBKS: చిన్నపిల్లాడిని చేసిన న‌ర‌కం చూపించారు…పంజాబ్ ఓన‌ర్లు దుర్మార్గులు

Advertisement

లేటెస్ట్ గా ఇదే అంశంపై తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) కూడా స్పందించారు. అభిషేక్ శర్మ సెంచరీ కొట్టడంపైన విమర్శలు చేస్తూ.. అతని బ్యాట్లను కచ్చితంగా చెక్ చేయాలని కోరాడు. కళ్ళు మూసుకొని అభిషేక్ శర్మ బ్యాట్ ఊపుతున్నాడని బాంబు పేల్చారు. అయినప్పటికీ బ్యాట్ కు బంతి తగిలితే సిక్సర్ వెళ్తోందని స్పష్టం చేశారు. అతడు వాడే బ్యాట్ లో చిప్ లు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు త‌న్వీర్ అహ్మ‌ద్. దీంతో తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

అభిషేక్ శర్మ సెంచ‌రీపై తన్వీర్ అహ్మద్ సంచలన ప్రకటన 

ఢిల్లీ క్యాపిటల్స్ పైన అభిషేక్ శర్మ సెంచరీ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో అతని పేరు మారుమోగుతోంది. అయితే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం అభిషేక్ శర్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అభిషేక్ శర్మ కళ్ళు మూసుకొని బ్యాటింగ్ చేస్తున్నాడని తన్వీర్ అహ్మద్ విమర్శలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో అభిషేక్ శర్మ ఆడితే తేలిపోతాడని సెటైర్లు పేల్చారు. మహమ్మద్ అమీర్ చెప్పినట్లుగానే అభిషేక్ శర్మ స్లాగర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇండియన్ పిచ్ ల పైన మాత్రమే అభిషేక్ శర్మ ( abhishek sharma)  అదరగొడతాడని చురకలు అంటించారు.

Advertisement

బౌండరీలు అలాగే సిక్సర్లు కొట్టిన అభిషేక్ శర్మ గతంలో కంటే స్లోగానే బ్యాటింగ్ చేశాడని విమర్శలు చేశారు. అయితే అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేసేటప్పుడు కచ్చితంగా అతని బ్యాట్లు చెక్ చేయాలని కోరారు. అటు షాహిద్ అఫ్రిది కూడా ఇదే తరహాలో విమర్శలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు బౌల‌ర్ల‌తో కాకుండా తన అల్లుడు షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో సిక్సర్లు కొట్టాలని సవాల్ విసిరారు. తన అల్లుడు షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో సిక్సర్లు కొట్టాలంటే గ‌ట్స్ కావాల‌ని.. అంత ద‌మ్ము అభిషేక్ శ‌ర్మ ద‌గ్గ‌ర లేద‌ని విమ‌ర్శ‌లు చేశారు.

 

 

Also Read: Rohit Sharma Fitness Video : గంట‌కు 100 Push-Ups..రోహిత్ శ‌ర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×