Geetha Singh : గీతా సింగ్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన కితకితలు సినిమాలో హీరోయిన్ గా నటించి కడుపుబ్బా నవ్వించింది. ఈ మూవీ మంచి హిట్ అందుకోవడంతో ఆమెకు ఆ తర్వాత వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. పలు సినిమాలలో కమెడియన్ గా నటించడంతో పాటుగా.. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే నటనతో అందరిని మెప్పించింది.. ఎన్నో సినిమాలలో నటించిన ఈమె ఈమధ్య సినిమాలలో కనిపించడం లేదు. అందుకు కారణం అవకాశాలు లేకపోవడమే అని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఆ తర్వాత బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా అవకాశాల రావడం లేదని ఆమె చెప్పి ఎమోషనల్ అయ్యింది. అయితే ఇప్పుడు బుల్లితెరపై అవకాశాల వస్తున్నట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం ఆమెకు ఓ సీరియల్ లో కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజమేంత ఉందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్లలో గుండమ్మ కథ సీరియల్ కూడా ఒకటి. అధిక బరువు ఉన్న ఒక అమ్మాయి అందంగా ఉన్నాయి. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది.. అలాగే ఒక అబ్బాయి కూడా అందంగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ వీరిద్దరి కుటుంబాల పెద్దలు బలవంతంగా ఇద్దరికీ పెళ్లి చేస్తారు.. ఆ తర్వాత వాళ్ళిద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది అన్నది ఈ సీరియల్ స్టోరీ. ఇందులో హీరోయిన్ పాత్రలో పూజ నటిస్తున్నారు. ఇప్పుడు ఆ పాత్రలో గీతా సింగ్ నటించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే బుల్లితెరపై గీతా సింగ్ తన క్రేజ్ ని ఎలా పెంచుకుంటుందో చూడాలి..
Also Read :Allu Arjun : హైకోర్టుకు అల్లు అర్జున్.. అభిమానులకు బిగ్ షాక్..
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి జై మూవీతో ప్రేక్షకులకు దగ్గరైంది బొద్దుగుమ్మ గీతా సింగ్.. ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన కితకితలు సినిమాలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్‌గా నటించారు గీతా సింగ్.. లావుగా ఉన్న అమ్మాయి తో కాపురం చేయలేని భర్త సన్నగా ఉండే అమ్మాయితో ప్రేమలో పడతాడు.. కానీ తన భార్య తనకి అందమని చివరికి తెలుసుకొని ఆమెను భార్యగా ఒప్పుకుంటాడు. ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఆ తర్వాత ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.. తర్వాత ఎవడిగోల వాడిది, అల్లరి పిడుగు, ప్రేమాభిషేకం, దొంగల బండి, శశిరేఖ పరిణయం, మళ్లీ మళ్లీ, సీమటపాకాయ్, ధూల్, సరైనోడు వంటి సినిమాల్లో నటించింది. దాదాపు 20 ఏళ్ల తన కెరీర్లో 150 సినిమాలకు పైగా నటించింది. అయితే గత కొన్నిళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చింది.. మరి ఈ సీరియల్ తో ఆమె ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి..