Team India: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026 ) విజేతగా టీమిండియా ( Team India) నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో తమ భార్యలు, ప్రియురాళ్లతో ఎంజాయ్ చేశారు టీమిండియా ఆటగాళ్లు. ఈ సందర్భంగా తన ప్రియురాలు అదితి హుండియాను ( Aditi Hundia) పరిచయం చేశాడు ఇశాన్ కిషన్ ( Ishan Kishan). గ్రౌండ్ లోకి తీసుకువచ్చి ఆమెకు కిస్ కూడా ఇచ్చాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: T20 World Cup 2026: పేరుకే మోడీ స్టేడియం..కానీ మొత్తం దోపిడే, ఒక్క వాటర్ బాటిల్ రూ.100
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ ప్రస్తుతం అదితి హుండియాతో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. గతంలోనే అనేక రూమర్లు రాగా, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిచిన తర్వాత అందరికీ పరిచయం చేశాడు ఇషాన్ కిషన్. దీంతో అదితి హుండియా ఎవరు అని అందరూ ఆరా తీస్తున్నారు. టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ప్రియురాలు ఆదితి హుండియా ప్రముఖ మోడల్. ఆమె కొన్ని వ్యాపారాలు కూడా చేస్తున్నారు. కొంతమంది 97 జనవరి 15వ తేదీన రాజస్థాన్లోని జైపూర్ లో అదితి హుండియా జన్మించారు. 2017 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో కూడా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫైనల్ దాకా చేరుకొని నిరాశపరిచారు. అయితే 2018లో జరిగిన మిస్ దివ సూప్రా నేషనల్ పోటీల్లో మాత్రం ఆమె కిరీటాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు 2019లో మిస్ సూపర్ నేషనల్ పోటీల్లో ఇండియా తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించి మంచి మార్కులు తెచ్చుకున్నారు. లేబుల్ అదితి హుండియా అనే బ్రాండ్ ఉన్న బట్టలను ఆమె విక్రయిస్తున్నారు. ఈ బ్రాండ్ తో చాలా స్టోర్స్ కూడా ఓపెన్ చేశారు.
2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సమయంలో అదితి హుండియాను ( Aditi Hundia) అలాగే టీమిండియా వికెట్ కీపర్ ఇశాన్ కిషన్ మధ్య సంబంధం ఏర్పడింది. ఆ సమయంలోనే ముంబై ఇండియన్స్ జట్టును సపోర్ట్ చేస్తూ స్టేడియంలో రచ్చ చేసింది అదితి హుండియాను ( Aditi Hundia). ఈ గ్యాప్ లోనే మొదట ఈ ఇద్దరు ఫ్రెండ్స్ గా మారి ఆ తర్వాత ప్రేమికులయ్యారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఇషాన్ కిషన్ తాతయ్య కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ఇషాన్ కిషన్ ఓకే అంటే పెళ్లి చేస్తామని ఆయన వెల్లడించారు.
just got to know that Ishan Kishan’s gf Aditi Hundia is a former Miss India Finalist and she is from Jaipur.. Raasthani Baddie 😍 pic.twitter.com/ojMBZSitQG
— Arun Lol (@dhaikilokatweet) March 9, 2026