E-Paper
Advertisement

Arshdeep Singh: Arshdeep Singh: అర్ష్‌దీప్‌ సింగ్‌ కు ఐసీసీ బిగ్ షాక్‌.. ముక్కు పిండి డ‌బ్బులు వ‌సూలు

Arshdeep Singh: Arshdeep Singh: అర్ష్‌దీప్‌ సింగ్‌ కు ఐసీసీ బిగ్ షాక్‌.. ముక్కు పిండి డ‌బ్బులు వ‌సూలు
Advertisement

Arshdeep Singh: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ కు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. అర్ష్‌దీప్‌ సింగ్‌ పై భారీగా ఫైన్ విధించింది ఐసీసీ. 2026 T20 ప్రపంచ కప్ ఫైనల్లో డారిల్ మిచెల్‌ను బంతితో బ‌లంగా కొట్టినందుకు గానూ యాక్ష‌న్ తీసుకుంది. ఇందులో భాగంగానే అర్ష్‌దీప్‌ సింగ్‌ పై మ్యాచ్ ఫీజులో 15 శాతం ఫైన్ వేసింది. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో టీమిండియా స్టార్ క్రికెట‌ర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ పై ( Arsh deep Singh Fine) ఫైన్ వేసిన న్యూస్ వైర‌ల్ గా మారింది.

Also Read: Pak On Team India: అంతా ఫిక్సింగే..టీమిండియా విజ‌యం వెనుక‌ అమిత్ షా, ధోని, రోహిత్ కుట్రలు ?

అర్ష్‌దీప్‌ సింగ్‌ కు ఐసీసీ బిగ్ షాక్‌..మ్యాచ్ ఫీజులో 15 శాతం ఫైన్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ ( Arshdeep Singh), న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ ( Daryl Mitchell) మధ్య చిన్న పాటి గొడవ జరిగిన సంగతి తెలిసిందే. టీమిండియా విధించిన భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అప్పటికే న్యూజిలాండ్ ఆటగాళ్లందరూ ఒత్తిడిలోకి వెళ్లారు. ఆ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ ను టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ బంతితో బలంగా కొట్టాడు. అంతకు ముందు అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్ లో వరుసగా సిక్సర్లు వెళ్లాయి. ఆ కోపంలో ఉన్న అర్ష్‌దీప్‌ సింగ్‌.. క్రీజు వదిలి బయటకు వచ్చిన న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ ను బందితో బలంగా కొట్టాడు.

ఈ క్రమంలో అర్ష్‌దీప్‌ సింగ్‌ ను బ్యాట్ తో కొట్టేందుకు దూసుకు వచ్చాడు డారెల్ మిచెల్. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. ఇక అక్కడే ఉన్న టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అలర్ట్ అయ్యాడు. న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ ను సముదాయించాడు సూర్య కుమార్ యాదవ్. అటు అర్ష్‌దీప్‌ సింగ్‌ కు ఫీల్డ్ ఎంపైర్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో వెంటనే న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ కు అర్ష్‌దీప్‌ సింగ్‌ వెంటనే షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు.

Advertisement

మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత ఇద్దరు బాగానే మాట్లాడుకున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్ లో అర్ష్‌దీప్‌ సింగ్‌ ఓవరాక్షన్ చేశాడని తాజాగా ఐసీసీ యాక్షన్ తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 15% జరిమానా విధించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. అలాగే ఒక డీమెరిట్ పాయింట్ కూడా అర్ష్‌దీప్‌ సింగ్‌ ఖాతాలో యాడ్ చేసింది ఐసీసీ. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.9 అర్ష్‌దీప్‌ సింగ్‌ ఉల్లంఘించాడని పేర్కొంది ఐసిసి ( ICC). ఇందులో భాగంగానే అర్ష్‌దీప్‌ సింగ్ పై ఫైన్ విధించినట్లు స్పష్టం చేసింది.

Also Read: Sahibzada Farhan: ఐసీసీని కోర్టుకు ఈడ్చుతా..నాకు ద‌క్కాల్సిన అవార్డ్, సంజుకు ఎలా ఇస్తారు ?

 

Related News

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

Big Stories

Advertisement
×