BigTV English

Team India: ఈ హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసి..ఎంజాయ్ చేస్తున్న టీమిండియా ప్లేయ‌ర్లు!

Team India: ఈ హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసి..ఎంజాయ్ చేస్తున్న టీమిండియా ప్లేయ‌ర్లు!

Team India: టీమ్ ఇండియా ప్లేయర్లు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించడం చాలా కామన్. ఇప్పటికే ఎంతోమంది టీమిండియా ప్లేయర్లు హీరోయిన్లతో ప్రేమాయణం కొనసాగించారు. అందులో కొంతమంది వారి ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లగా మరి కొంతమంది ప్రేమ మధ్యలోనే ముగింపు పలికాయి. ఒక అమ్మాయిని ప్రేమించి మరో అమ్మాయిని వివాహం చేసుకున్న ప్లేయర్లు ఎంతో మంది ఉన్నారు. వివాహం చేసుకున్న టీమిండియా ప్లేయర్లు ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు.


Also Read: Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే

విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి చెప్పనవసరం లేదు. అతడు క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టిన వెంటనే ఎంతోమంది హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నాడు. అందులో టాలీవుడ్ నటి తమన్నా కూడా ఒకరు. ఎంతోమంది హీరోయిన్లతో సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగించిన అనంతరం బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ప్రేమలో పడ్డాడు. ఓ యాడ్ షూట్ లో మొదటిసారిగా కలుసుకున్న విరాట్ అనుష్క మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. కొన్ని సంవత్సరాల పాటు సీక్రెట్ గా రిలేషన్ కొనసాగించారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ధోని

ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోని క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చేవారికి ఎంతగానో ప్రోత్సాహం ఇస్తాడు. ఇక ధోని వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఇతడు తన వివాహానికి ముందు బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనేతో ప్రేమాయణం నడిపినట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. వీరిద్దరూ చాలా సందర్భాలలో బయట కెమెరా కంట కూడా పడ్డారు. అనంతరం ఏమైందో తెలియదు ధోని సాక్షి సింగ్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ధోని, సాక్షి సింగ్ ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు.


హార్దిక్ పాండ్యా

క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతడు తనదైన ఆటతీరుతో క్రికెట్ రంగంలో ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. ఇక హార్దిక్ పాండ్యా వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఇతడు సెర్బియా నటి నటాషా స్టాంకోవిక్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు వివాహానికి ముందే ఓ బాబుకు జన్మనిచ్చారు. వివాహం జరిగిన అతి తక్కువ సమయంలోనే మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం వారి కుమారుడికి కో పేరెంట్స్ గా ఉంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కుమారుడు అగస్త్య ఇండియాకు వచ్చినప్పుడల్లా హార్దిక్ పాండ్యాతో కలిసి ఉంటాడు. అనంతరం తన తల్లితో కలిసి సెర్బియాకు తిరిగి వెళ్తాడు. కాగా హార్దిక్ పాండ్యా విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా కొంతమంది హీరోయిన్లతో ఎఫైర్ కొనసాగిస్తున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. దానికి తగినట్టుగానే హార్దిక్ చాలామంది అమ్మాయిలతో దిగిన ఫోటోలు వైరల్ గా అయ్యాయి. కానీ అందులో హార్దిక్ పాండ్యా ఎవరిని వివాహం చేసుకోకపోవడం గమనార్హం.

భువనేశ్వర్ కుమార్

టీమ్ ఇండియా స్టార్ పెసర్ భువనేశ్వర్ కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇతను టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ఇక భువనేశ్వర్ కుమార్ వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఇతడు టాలీవుడ్ నటి అనుస్మృతి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడని సీక్రెట్ గా రిలేషన్ పెట్టుకున్నట్టుగా అనేక రకాల వార్తల వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారట. అనంతరం ఏమైందో తెలియదు భువనేశ్వర్ కుమార్ నుపుర్ నగర్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది.

Related News

Asia Cup 2025 : ఆసియా కప్ లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. మొదటి, పాకిస్తాన్ తో మ్యాచ్ ఎప్పుడు అంటే

Pravin Tambe : కసి ఉంటే చాలు…41 ఏళ్ల వయసులో కూడా ఐపిఎల్ లోకి ఎంట్రీ… ఇంతకీ ఎవరా క్రికెటర్.. పూర్తి వివరాలు ఇవే

Team India : మస్త్ షెడ్స్ చూపిస్తున్నారు.. ఆసియా కప్ గెలవక పోవాలి… మీకు ఉంటుంది… టీమిండియా ప్లేయర్లపై దారుణంగా ట్రోలింగ్

Hardik Pandya : హార్దిక్ పాండ్యా వాచ్ ధర ఎంతో తెలుసా… పాకిస్తాన్ బాబర్ ఆస్తులు మొత్తం అమ్ముకున్న సరిపోదు

Virender Sehwag : ఖాళీ కడుపుతోనే పాక్‌పై సెంచరీ చేశా.. సెహ్వాగ్ సెన్షేష‌న్ కామెంట్స్

Big Stories

×