Team India Jersey : టీమిండియా (Team India) కి ప్రస్తుతం స్పాన్సర్ షిప్ లేదనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రమోషన్ బిల్లు రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ బిల్లు 2025 అమలులోకి వచ్చిన నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తమ జట్లకు జెర్సీ స్పాన్సర్ గా ఉన్న ప్రధాన గేమింగ్ ప్లాట్ ఫామ్ డ్రీమ్ 11 (Dream 11) తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. అయితే తాజాగా బీసీసీఐ (BCCI) టీమిండియా జెర్సీ స్పాన్సర్ షిప్ రేట్లను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్ల జెర్సీలకు అధికారికంగా స్పాన్సర్ లేకుండా పోయారు. సెప్టెంబర్ 09న ఆసియా కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. టీమిండియా జెర్సీ (Team India Jersey) లేకుండానే దిగుతుందని కొందరూ పేర్కొంటే.. టీమిండియా స్పాన్సర్ తోనే బరిలోకి దిగుతుందని మరికొందరూ పేర్కొంటున్నారు. టీమిండియా స్పాన్షర్ షిప్ లేకుండానే బరిలోకి దిగుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే.. కేవలం 4 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Also Read : Ashwin-Babar : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?
ముఖ్యంగా బీసీసీఐ (BCCI) టీమిండియా జెర్సీ స్పాన్సర్ షిప్ ను పెంచడం ఇప్పుడు సంచలనంగా మారింది. ద్వైపాక్షిక మ్యాచ్ లకు 3.50 కోట్లు కాగా.. ICC/ACC మ్యాచ్ లకు 1.50కోట్లు పెంచినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. దీంతో అందరూ షాక్ కి గురవుతున్నారు. ఇంతలా పెంచారా..? అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా కి ప్రస్తుతం స్పాన్సర్ షిప్ చేసేందుకు రకరకాల పేర్లు వినిపించాయి. కానీ అది వాస్తవం కాదని తేటతెల్లం అయింది. ముఖ్యంగా టెస్లా కంపెనీ, టెక్ స్టార్టప్, టాటా గ్రూపు, రిలియన్స్, అదానీ, విమల్ పాన్ మసాలా ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. బీసీసీఐ అధికారికంగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసే వరకు స్పాన్షర్ షిప్ వ్యవహారం అనేది ఉత్కంఠగానే మారనుంది. వాస్తవానికి 2023లో రూ.358 కోట్లతో మూడేళ్ల వరకు డ్రీమ్ 11తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సారి ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు ఆటగాళ్లు ఎలాంటి జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగనున్నట్టు సమాచారం. స్పాన్సర్ షిప్ హక్కుల కోసం బీసీసీఐ త్వరలోనే కొత్త బిడ్ ని ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 09 ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు బీసీసీఐ స్పాన్సర్ లేకుండా ఆడనుందని స్పష్టం అయింది. మరోవైపు స్పాన్సర్ గురించి రకరకాల పేర్లు వినిపించడంతో ఇంతకు అసలు టీమిండియాకి స్పాన్సర్ గా ఎవ్వరూ వ్యవహరిస్తున్నారని అభిమానులు కాస్త గందరగోళంలో పడ్డారు. బీసీసీఐ అధికారికంగా ధృవీకరించే వరకు ఇలాంటి వార్తలు వినిపించడం ఖాయం అనే స్పష్టంగా తెలుస్తోంది అని కొందరూ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బీసీసీఐ టీమిండియా జెర్సీ ధరలను పెంచినట్టు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. అది చూసి అంతా ఆశ్చర్యపోవడం విశేషం.
THE NEW BASE PRICE FOR JERSEY SPONSORSHIP OF INDIA. 🇮🇳
– 3.50cr per bilateral match. 💰
– 1.50cr per ICC/ACC match. (Cricbuzz). pic.twitter.com/SuNBzXUxPB— Mufaddal Vohra (@mufaddal_vohra) September 5, 2025