Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తొలి ఘట్టం ముగిసింది. కంటెస్టెంట్స్ పరిచయం, ఆరంగేట్రం అయిపోయింది. ఆదివారం(సెప్టెంబర్ 7) బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఘనంగా ప్రారంభమైంది. హౌజ్ లోకి 9 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్ ఎంట్రీ ఇచ్చారు.
సెలబ్రిటీలలో టీవీ నటుడు భరణి, బుజ్జిగాడు ఫేం సంజన గల్రానీ, ఒకప్పటి హీరోయిన్, నటి ఆశా సైనీ, ఢీ ఫేం జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ, ఫోక్ సింగర్ రామ్ రాథోడ్, నటుడు సుమన్ శెట్టి, సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్ రితూ చౌదరి, జబర్దస్త్ ఫేం ఇమ్మాన్యుయేల్, కన్నడ నటి తనూజలు కంటెస్టెంట్స్ గా వచ్చారు.
ఇక కామనర్స్ నుంచి మొత్తం ఐదుగురు హౌజ్ లోకి వచ్చారు. వారిలో కళ్యాణ్ పడాల, మాస్క్ మ్యాన్ హరీశ్, డిమోన్ పవన్, శ్రీజ దమ్ము, ప్రియ శెట్టి, మర్యాద మనీష్ లు ఫైనల్ అయ్యారు. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌజ్ లో అడుగుప్టెటారు. ఈసారి బిగ్ బాస్ సరికొత్త థీమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతవరకు ఎన్నడు లేని విధంగా సరికొత్త థీమ్, కలర్ ఫుల్ గా బిగ్ బాస్ హౌజ్ సిద్ధమైంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలుగా హౌజ్ లో పోటీ ఉండబోతోంది. ఊహించని మలుపు, డబుల్ హౌజ్, డబుల్ డోస్ తో ఈసారి హౌజ్ రణరంగంలా మారనుంది.
అయితే హౌజ్ ని రెండు ఇళ్లుగా విభిజించారు. కామనర్స్ కి మెయిన్ హౌజ్, సెలబ్రిటీలకు అవుట్ హౌస్ ఫిక్స్ చేశారట. టాస్క్ లో గెలిచి మెయిన్ హౌజ్ లోకి వెళ్లేవారు వారు టెనెట్ గానే ఉంటారట. ఇలా సెలబ్రిటీలకు అవుట్ హౌజ్ ఇచ్చి అప్పుడే చిచ్చు పెట్టాడు. ఇక టాస్క్లో గెలిచిన వారు మెయిన్ హౌజ్ యాక్సెస్ పోందుతారు. ఇక రేపటి నుంచి అసలు పరీక్ష మొదలు కానుంది. సెలబ్రిటీలు, కామనర్స్ మధ్య పోటీ ఓ రేంజ్ లో ఉండబోతుంది.. హౌజ్ వార్, గోడవలు, ఊహించని ట్విస్టులు, మలుపులో బిగ్ బాస్ యుద్ద భూమిని తలపించబోతుంది. మరి బిగ్ బాస్ హౌజ్ రణరంగం ఎలా ఉండబోతుందో రేపటి నుంచి మొదలు కానుంది.