పర్యాటకుల కోసం వియత్నాం టూర్ ప్యాకేజీని పరిచయం చేసింది IRCTC. ఈ టూర్ ప్యాకేజీ ముంబై నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం ఈ టూర్ ప్యాకేజీ 8 రోజుల పాటు కొనసాగనుంది. IRCTC శీతాకాలపు ప్రత్యేక టూర్ ప్యాకేజీల్లో భాగంగా వియత్నాం టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ డిసెంబర్ లో ప్రారంభమవుతుంది. IRCTC పర్యాటకుల కోసం దేశీయంగానే కాకుండా, విదేశాలకు సంబంధించి పలు టూర్ ప్యాకేజీలను పరిచయం చేస్తుంది. ఈ టూర్ ప్యాకేజీల ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే పర్యాటకులు కూడా చౌకగా, సౌకర్యవంతంగా ఈ టూర్ లలో పాల్గొంటున్నారు. IRCTC టూర్ ప్యాకేజీలలో భాగంగా, పర్యాటకుల బస, ఆహారం ఉచితంగా అందించనుంది. .
ఇక IRCTC వియత్నాం టూర్ ప్యాకేజీ 7 రాత్రులు, 8 పగళ్ల పాటు కొనసాగనుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ. 1,29,300గా అధికారులు నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా హో చి మిన్ సిటీ, డా నాంగ్, హనోయ్, హనోయ్ బే క్రూయిజ్ డెస్టినేషన్స్ టూర్ ప్యాకేజీలో కవర్ చేయబడతాయి. ఈ టూర్ ప్యాకేజీలో, పర్యాటకులు విమానంలో ప్రయాణిస్తారు. ఈ టూర్ ప్యాకేజీ డిసెంబర్ 16న ప్రారంభమవుతుంది.
వియత్నాం టూర్ ప్యాకేజీలో మీరు ఒంటరిగా ప్రయాణిస్తే, ఒక్కొక్కరు రూ.1,50,460 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. టూర్ ప్యాకేజీలో ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తే, ఒక్కొక్కరికి రూ.1,29,300 ఛార్జీ చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తే, ఒక్కొక్కరికి రూ.1,29,300 ఛార్జీ చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో, బెడ్ కావాలనుకున్న 5 నుంచి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రూ.1,04,600 చెల్లించాల్సి ఉంటుంది. బెడ్ లేని పిల్లలకు ఛార్జీ రూ.97,500గా నిర్ణయించింది. IRCTC ఈ టూర్ ప్యాకేజీలో, పర్యాటకుల బస, ఆహారం ఉచితంగా అందించనున్నారు. ఇక ఈ ప్యాకేజీకి సంబంధించి పర్యాటకులు IRCTC అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.
Read Also: ప్రయాణీకుల భద్రతకు రైల్వే కీలక నిర్ణయం, ఇక కోచ్ లలోనూ సీసీ కెమెరాలు!
ఇక ఈ టూర్ లో భాగంగా శీతాకాలంలో వియత్నాం అందాలను చూస్తూ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఇంకా క్రిస్మస్ వేడుకలను కూడా అక్కడే జరుపుకునే అవకాశం ఉంటుంది. గతంలోనూ IRCTC వియత్నాం, కాంబోడియా టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. అప్పుడు టూర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు మరోసారి వియత్నాం టూర్ అందుబాటులోకి తీసుకురాబోతోంది.
Read Also: రూ. 24 వేలకే జ్యోతిర్లింగాల దర్శనం, IRCTC అదిరిపోయే ప్యాకేజీ!