Rinku Singh: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న నేపథ్యంలో టీమిండియా ( Team India) స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ ( Rinku Singh) ఇంట విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇవాళ వేకువ జామున రింకూ సింగ్ ( Rinku Singh Father) తండ్రి ఖచేంద్ర సింగ్ ( Khanchandra Singh) మృతి చెందారు. కొన్ని రోజుల నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్న రింకూ సింగ్ తండ్రి సింగ్ పరిస్థితి విషమించిన నేపథ్యంలో.. ఫిబ్రవరి 27వ తేదీన వేకువ జామున మరణించారు. దీంతో రింకూ సింగ్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ మరణ వార్త వినగానే చెన్నై నుంచి నేరుగా ఉత్తర ప్రదేశ్ లోని తన సొంత ఊరుకు వెళ్లిపోయాడు రింకూ సింగ్. ఈ నేపథ్యంలోనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ గ్రామంలో ( Aligarh Village ) తన తండ్రి అంతక్రియలను నిర్వహించారు రింకూ సింగ్ కుటుంబ సభ్యులు. అయితే ఈ సందర్భంగా తన తండ్రి పాడే మోసాడు రింకూ సింగ్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
టీమిండియా బెస్ట్ ఫినిషర్ రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ మరణించిన సంగతి తెలిసిందే. లివర్ క్యాన్సర్ కారణంగా ఆయన మరణించారు. నాలుగో స్టేజ్ లో క్యాన్సర్ ఉన్న నేపథ్యంలో ఆస్పత్రిలోనే కన్నుమూశాడు ఖచంద్ర సింగ్. ఇవాళ వేకువ జామున ఖచంద్ర సింగ్ మరణించిన నేపథ్యంలో హుటాహుటిన అలీఘర్ ( Aligarh) గ్రామానికి చేరుకున్నాడు రింకూ సింగ్. సాయంత్రం కల్లా రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ సందర్భంగా తన తండ్రి పాడే మోసాడు రింకూ సింగ్. తలకొరివి రింకూ సింగ్ సోదరుడు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి పాడే మోసి, ఎమోషనల్ అయ్యాడు రింకూ సింగ్. పోలీస్ బందోబస్తు మధ్య రింకూ సింగ్ తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. అటు రింకూ సింగ్ పాడే మోసిన వీడియోను ఆయన ప్రియురాలు, కాబోయే భార్య ప్రియా సరోజ్ కూడా షేర్ చేశారు. తన మామయ్యకు నివాళులర్పించారు.
చనిపోక ముందు తన కొడుకు రింకూ సింగ్ కు వీడియో కాల్ చేశారు ఖచంద్ర సింగ్. తన కొడుకు టి20 వరల్డ్ కప్ ఆడుతున్న నేపథ్యంలో ప్రతిరోజు ఆసుపత్రి నుంచి వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు రింకు సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్. ఈ నేపథ్యంలోనే ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు కూడా ఆగవు. అంతలా ఎమోషనల్ టచ్ ఈ వీడియోలో కనిపిస్తోంది.
Also Read: Daisy Shah On Palash: పలాష్ ముచ్చల్ చాలా మంచోడు..స్మృతినే కిలాడీ లేడీ ?..బాలీవుడ్ నటి సంచలనం !
?utm_source=ig_web_copy_link
?utm_source=ig_web_copy_link