E-Paper
Advertisement

Mohammad Amir Jail: సెమీస్ లోకి టీమిండియా ఎంట్రీ…అండమాన్ జైలుకు మహమ్మద్ అమీర్ !

Mohammad Amir Jail: సెమీస్ లోకి టీమిండియా ఎంట్రీ…అండమాన్ జైలుకు మహమ్మద్ అమీర్ !
Advertisement

Mohammad Amir Jail:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో టీమిండియా సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందరూ ఊహించినట్లుగానే వెస్టిండీస్ పై అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న టీమిండియా, ఇంగ్లాండ్ జట్టుతో సెమీ ఫైనల్ ఆడేందుకు సిద్ధమైంది. టీమిండియా సెమీ ఫైనల్ లో అడుగుపెట్టిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ ను ( Mohammad Amir) అండమాన్ జైలుకు పంపించాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్. వాడిని వెంటనే అరెస్టు చేసి జైల్లో పాడేయాలని దారుణంగా ఆడుకుంటున్నారు. ఈ మేరకు టీవీ డిబేట్ ల‌లో కూడా చర్చిస్తున్నారు.

Also Read: India vs West Indies: సంజూ ర‌ఫా..ర‌ఫా, వెస్టిండీస్ పై 10 ఏళ్ల రివేంజ్ తీర్చుకున్న టీమిండియా…సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ

అండమాన్ జైలుకు మహమ్మద్ అమీర్.. ఇండియన్ ఫాన్స్ సరికొత్త డిమాండ్

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ( Team India vs West Indies ) మధ్య మ్యాచ్ కంటే ముందు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ వెర్రి కూతలు కూసాడు. వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఓడిపోతుందని వెల్లడించాడు. టీమిండియా ఇంటికి వెళ్లడం గ్యారంటీ అని తెలిపారు. పాకిస్తాన్ సెమీఫైనల్ వెళుతుంది తప్ప ఇండియా వెళ్లే ఛాన్సే లేదని కారు కూతలు కూశాడు. కానీ ఈడెన్ గార్డెన్స్ వేదికగా అద్భుతంగా రాణించిన టీమిండియా సెమీ ఫైనల్ లో అడుగుపెట్టింది. దీంతో మహమ్మద్ అమీర్ ను ( Mohammad Amir Jail ) అండమాన్ జైలుకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు ఇండియన్ ఫాన్స్. మహమ్మద్ అమీర్ పెద్ద ఫిక్స‌ర్ అని, అలాంటోడిని జైలులో వేయాల‌ని కోరుతున్నారు. మ్యాచ్ కంటే ముందు విర్రవీగిన మహమ్మద్ అమీర్ ను వెంటనే అరెస్టు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు కూడా పెడుతున్నారు ఫ్యాన్స్.

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సెమీ ఫైనల్

ఆదివారం రోజున వెస్టిండీస్ పై విజయం సాధించి సెమీఫైనల్ లో అడుగు పెట్టింది టీం ఇండియా. దీంతో ఇంగ్లాండ్ తో టీమిండియా సెకండ్ సెమీఫైనల్ ఆడనుంది. ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ముంబై వేదికగా మార్చి 5వ తేదీన మ్యాచ్ ఉంటుంది. ఈ రెండో సెమీ ఫైనల్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ వస్తుంది. అంతకంటే ముందు మార్చి 4వ తేదీన దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి సెమీఫైనల్ ఉంటుంది. ఈ రెండు సెమీఫైనల్స్ లో గెలిచిన జట్లు ఫైనల్స్ లో తలపడతాయి. మార్చి 8వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్ ఉంటుంది.

Advertisement

Also Read: India vs West Indies: విండీస్ ఫ‌స్ట్ బ్యాటింగ్..ఐసీసీని ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గా మార్చారు…విషం క‌క్కిన పాక్‌

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×