IND VS SA T20 Series: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa ) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India) సంచలన ప్రకటన చేసింది. దక్షిణాఫ్రికాతో ఆడబోయే టి20 జట్టును తాజాగా ప్రకటించింది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడబోయే 15 మంది లిస్టును అధికారికంగా వెల్లడించింది. ఈ లిస్టులో హార్దిక్ పాండ్యా తో పాటు వన్డే కెప్టెన్ గిల్ కూడా స్థానం సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు గాయం కారణంగా జట్టుకు దూరం కాగా, దక్షిణాఫ్రికా తో జరిగే టి20 సిరీస్ కు మాత్రం అందుబాటులోకి వస్తారని ప్రకటన చేసింది. ఈ మేరకు టీమిండియా తుది జట్టును ప్రకటించింది.
దక్షిణాఫ్రికా తో జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం తాజాగా 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ లిస్టులో గిల్ స్థానం సంపాదించుకున్నప్పటికీ అతడు ఆడడం కష్టమేనని తెలుస్తోంది. మరో రెండు లేదా మూడు రోజుల్లో గిల్ హెల్త్ అప్డేట్ వస్తుందని, ఆ అప్డేట్ వచ్చిన తర్వాత అతడు జట్టులో ఉంటాడా లేదా అనేది తెలుస్తుందని ప్రకటించింది బీసీసీఐ. ఒకవేళ అతడు అన్ ఫిట్ అయితే, గిల్ స్థానంలో సంజు శాంసన్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు.
ఇక టీమ్ ఇండియా స్క్వాడ్ పరిశీలిస్తే , ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, గిల్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ గిల్ చివరి క్షణంలో టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే పరిస్థితులు వేరే ఉంటాయి. అతని స్థానంలో రియాన్ పరాగ్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు అభిషేక్ శర్మతో సంజు ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. వికెట్ కీపర్ గా జితేష్ శర్మ కొనసాగుతాడు. ఫస్ట్ డౌన్ లో సూర్య కుమార్ యాదవ్ కచ్చితంగా రానున్నాడు.
తిలక్ వర్మ మూడవ వికెట్ కు వస్తాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా లేదా శివం దూబే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, అక్షర పటేల్, కుల్దీప్ యాదవ్ ఉంటారు. ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఉండనున్నారు. ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, అక్షర పటేల్, శివం దుబే, హార్దిక్ పాండ్యా ఉన్నారు. అయితే ఇందులో 11 మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ శాతం హర్షిత రానా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యే ఛాన్సులు ఉంటాయి.
టీమిండియా: సూర్యకుమార్ యాదవ్ (C), శుభమన్ గిల్ (VC), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (WK), సంజు శాంసన్ (WK), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ , కె. సుందర్
Also Read: Ravi Shastri: నేను కోచ్‌గా ఉంటే బాధ్యత వహించేవాడిని, గంభీర్ లాగా చిల్లర వేశాలు వేసేవాడిని కాదు
Hardik Pandya is 🔙 ; Shubman Gill is included subject to a fitness clearance 🏃♂️ #INDvSA pic.twitter.com/Ta2ty3Gnsk
— ESPNcricinfo (@ESPNcricinfo) December 3, 2025