E-Paper
Advertisement

Goat Movie : ఫిలిం ఛాంబర్ లో పంచాయతీలన్నీ పెండింగ్, ఈ నిర్మాతకే ఎందుకు?

Goat Movie : ఫిలిం ఛాంబర్ లో పంచాయతీలన్నీ పెండింగ్, ఈ నిర్మాతకే ఎందుకు?
Advertisement

Goat Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఈ రోజుల్లో సినిమా జరగడం అనేది సజావుగా జరిగే కార్యక్రమం కాదు. ఏదో ఒక తరుణంలో కొన్ని వివాదాలు వస్తూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాజెక్ట్స్ కు సంబంధించి దర్శక నిర్మాతలు మారిపోతుంటారు. అలానే టీజర్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఉన్న చాలా మంది టెక్నీషియన్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యే టైంకి ఉండదు. ఈ మధ్యకాలంలో ఇది కూడా కామన్ అయిపోతుంది.

నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా మొదట అనౌన్స్ చేసినప్పుడు దర్శకుడుగా కళ్యాణ్ శంకర్, ఎస్ తమన్ ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ సినిమాకి మారి దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

అలానే సుడిగాలి సుదీర్ హీరోగా గోట్ అనే సినిమాకి దర్శకుడుగా వ్యవహరించాడు నరేష్ కుప్పిలి. ఒక తరుణంలో నరేష్ కుప్పిలిని సినిమా నుంచి తొలగించారు. దర్శకుడు చంద్రశేఖర్ తొలగించడానికి కారణం మూడు నుంచి ఐదు కోట్లలో అయిపోతుంది అనుకునే సినిమా బడ్జెట్ పెరగడం అని చెప్పారు. అయితే దీనికి సంబంధించి పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి.

పంచాయతీలు పెండింగ్ లోనే 

ఇండస్ట్రీలో జరిగే పంచాయితీలను ఫిల్మ్ ఛాంబర్ కూర్చొబెట్టి సెటిల్ చేస్తుంది. కానీ, ఇప్పుడు పంచాయితీలు అన్నీ పెండింగ్‌లోనే ఉంటున్నాయి.ఇప్పుడు నిర్మాత చంద్ర శేఖర్ రెడ్డి గోట్ మూవీకి సంబంధించి డైరెక్టర్ నరేష్ కుప్పిలి… హీరో సుధీర్ పై ఫిర్యాదు చేశాడు. ఇది ఇంకా పెండింగ్ లోనే ఉంది.

Advertisement

దీనికి ముందు ఇదే చంద్ర శేఖర్ రెడ్డి గతంలో, అద్భుతం మూవీ టైంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జాతో కూడా చిన్న ఇష్యూ వచ్చింది. అప్పుడు ఈ ఇద్దరిపై ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశాడు. అది ఇంకా సాల్వ్ అవ్వలేదు.

అద్భుతం సినిమా గురించి ప్రస్తావన కూడా తీసుకుని వస్తూ, ఈ సినిమాలో తేజ సజ్జను డామినేట్ చేస్తుంది కాబట్టి శివాని రాజశేఖర్ కి సంబంధించిన 15 నిమిషాలు డ్యూరేషన్ ఉండే సీన్స్ కట్ చేశారు అంటూ కూడా నిర్మాత కంప్లైంట్ చేశాడు.

ఈ నిర్మాతకే ఎందుకు 

అయితే కొన్ని సందర్భాలలో ఇటువంటి పంచాయతీలు జరగడం అనేది కొన్ని అపార్ధాల వలన సాధారణంగానే జరుగుతుంది. కానీ ఒకే నిర్మాతకు ఇన్ని జరగడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అయితే నిర్మాత చంద్రశేఖర్ గురించి ఇప్పటివరకు హీరోలు కానీ దర్శకులు గానీ బయటకు వచ్చి మాట్లాడలేదు.

నిర్మాత చంద్రశేఖర్ తో వాళ్లకున్న విభేదాలు ఏంటో చెబితే అన్ని వైపుల నుంచి ఒక క్లారిటీ వస్తుంది. లేదంటే ఎవరికి వాళ్లు పాజిటివ్ గా చెప్పుకుంటూనే ఉంటారు.

Also Read: Drishyam 3 : భారీ అంచనాలు సినిమా కేవలం రెండు నెలల్లో షూటింగ్ పూర్తి

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×