Team India: అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది తెలుగు, తమిళ్, మలయాళ, హిందీలో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ చిన్నది ‘అ ఆ’ సినిమాలో కీలక పాత్రలో నటించి తనలోని టాలెంట్ ను బయటపెట్టింది. ఆ సినిమా అనంతరం ఈ చిన్నదానికి వరుసగా హీరోయిన్ గా సినిమా అవకాశాలు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో హీరోయిన్ గా చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. తాను నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా చేసింది.
పెళ్ళైన టీమిండియా (Team India ) క్రికెటర్ తో రిలేషన్ ?
ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి క్షణాల్లోనే వైరల్ అవుతాయి. సోషల్ మీడియాలో తనకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిన్నది ఫుల్ ఫామ్ మీద తన కెరీర్ కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా…. ఈ చిన్నది వయసు పెరిగినప్పటికీ అదే అందం, ఫిట్నెస్ తో తన జోరు కొనసాగిస్తోంది. ఈ చిన్నది ఇప్పటివరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే తన లైఫ్ కొనసాగిస్తోంది. తన కెరీర్ ప్రారంభంలో అనుపమ ప్రముఖ క్రికెటర్ బుమ్రాతో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగించినట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి.
వీరిద్దరూ పీకల్లోకి ప్రేమలో మునిగితేలారని వివాహం కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా చాలాసార్లు అనేకసార్లు వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా అనుపమ చాలా సందర్భాలలో తనకు ఇష్టమైన క్రికెటర్ బుమ్రా అని చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. అనంతరం ఏమైందో తెలియదు జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు కూడా ఉన్నాడు. బుమ్రా వివాహం తర్వాత ఈ వార్తలకు చెక్ పడింది. ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran ) స్టార్ హీరో రామ్ పోతినేనితో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఈ చిన్నది ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నట్లుగా అందరూ అనుకుంటున్నారు. ఈ వార్తలపై అనుపమ కానీ రామ్ కానీ ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తేనే అసలు విషయం బయటికి రాదు.