Pakistani player: చాలా దేశాలలో జనాలు ఎక్కువగా ఇష్టపడేది ఒకటి సినిమాలు, రెండు క్రికెట్. ఈ రెండింటికి తిరుగులేని క్రేజ్ ఉంది. ఇక క్రికెట్ కాన్సెప్ట్ తో సినిమాలు వస్తున్నాయంటే.. జనాలకు అది ఓ పెద్ద పండగే. హీరోలకు కూడా ఫలానా క్రికెటర్ అంటే ఇష్టం అని చెబుతూ ఉండడం మనం తరచూ వింటూనే ఉంటాం. కొంతమంది క్రికెటర్లు కూడా తమ అభిమాన హీరోలను ఫాలో అవుతూ ఉంటారు.
Also Read: Prasidh krishna: కప్పను మింగిన పాములాగా తయారైన ప్రసిద్… టీమిండియాను ఓడించేందుకు కుట్రలు..?
అయితే తాజాగా ఓ పాకిస్తాన్ క్రికెటర్ మన బాలీవుడ్ హీరోని ఫాలో అవుతూ.. షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదికూడా అర్ధ న**గ్నంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ.. బాలీవుడ్ హీరో ని కాపీ చేశాడు పాకిస్తాన్ కి చెందిన ఓ క్రికెటర్. అతడు మరెవరో కాదు ఇఫ్తికార్ అహ్మద్. ఒక నెల రోజుల క్రితం నటుడు టైగర్ ష్రాఫ్ తన సినిమా షూట్ లో భాగంగా బీచ్ లో క్రికెట్ ఆడుతూ కనిపించాడు. మరోవైపు అక్షయ్ కుమార్ కూడా మరో ఎండ్ లో బ్యాటింగ్ చేశాడు.
నెల రోజుల క్రితం వైరల్ అయిన ఈ వీడియోలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కూడా కనిపించారు. టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ క్రీడాభిమానులు. వీరు గత ఏడాది ముంబై ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్న ముంబై ఎఫ్సీ పేరుతో ఓ ఫుడ్ బాల్ క్లబ్ ని కూడా ప్రారంభించారు. అయితే ఆమధ్య వైరల్ అయిన ఓ వీడియోలో టైగర్ తన బ్యాటింగ్ నైపుణ్యాలు, సిక్స్ ప్యాక్స్ రెండింటినీ ప్రదర్శించే వీడియోని పంచుకున్నాడు.
ఇప్పుడు అతడిని కాపీ కొడుతూ ఇఫ్తికర్ అహ్మద్.. అచ్చం అలాంటి వీడియోనే షేర్ చేశాడు. దీంతో భారత క్రీడాభిమానులు అతడిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతి విషయంలో భారత్ ని కాపీ కొట్టడం తప్ప మీకు సొంత తెలివితేటలు లేవని మరోసారి నిరూపించుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక 2008లో పెషావర్ క్రికెట్ జట్టు తరఫున ఆడుతూ ఇఫ్తికర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.
Also Read: Mohammed Siraj: ప్రభాస్ హీరోయిన్ తో రొమాన్స్.. తెలంగాణ డీఎస్పీ సిరాజ్ ఇంతకు తెగించాడ్రా!
అలాగే 2018 డిసెంబర్ 13న వెస్టిండీస్ తో జరిగిన టి-20 మ్యాచ్ ద్వారా పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశారు. తన కెరీర్ లో ఇప్పటివరకు 10 టెస్టులు ఆడిన ఈ పాకిస్తాన్ ప్లేయర్.. కేవలం 400 పరుగులు మాత్రమే చేశాడు. ఇక 28 వన్డేలో 850 పరుగులు, 40 టీ-20 లో 1200 పరుగులు చేశాడు. అలాగే టెస్టుల్లో 10 వికెట్లు, టి-20 లో 25 వికెట్లు, వన్డేల్లో 20 వికెట్లు పడగొట్టాడు. ఇక తాజాగా బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ని కాపీ చేస్తూ.. ఓ వీడియోని రిలీజ్ చేసి విమర్శలను ఎదుర్కొంటున్నాడు ఇఫ్తికార్ అహ్మద్.
— Out Of Context Cricket (@GemsOfCricket) July 5, 2025