Trolls On Gambhir: ఇంగ్లాండ్ పర్యటనను భారత జట్టు ఓటమితో మొదలుపెట్టిన విషయం తెలిసిందే. హెడింగ్లి వేదికగా జరిగిన మొదటి టెస్ట్ లో దాదాపు గెలిచే స్థితిలో కనిపించిన భారత జట్టు.. ఆ తరువాత అనూహ్యంగా తడబడి విజయాన్ని చేజార్చుకుంది. ఈ క్రమంలో సిరీస్ లో 0 – 1 స్థితిలో నిలిచింది. ఇప్పుడు ఎడ్జ్ బాస్టన్ వేదికగా జూలై 2వ తేదీ నుండి 2 వ టెస్ట్ కొనసాగుతోంది. ఈ 2 వ టెస్ట్ లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్ ని 1-1 తో సమం చేయాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.
బౌలింగ్ లో అట్టర్ ఫ్లాప్:
తొలి టెస్ట్ లో బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించిన భారత జట్టు… బౌలింగ్ లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 371 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక మ్యాచ్ ను ఇంగ్లాండ్ కి అప్పగించేసింది. దీంతో తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో భారత్ పై గెలుపొందింది. చివరి రోజు పిచ్ బ్యాటర్లకే ఎక్కువగా అనుకూలించింది. దీనికి తోడు ఓవర్ నైట్ బ్యాటర్ జాక్ క్రాలీ, బెన్ డకెట్ అద్భుతమైన డిఫెన్స్ తో భారత బౌలింగ్ ని అడ్డుకున్నారు.
బుమ్రా బౌలింగ్ లో పెద్దగా రిస్క్ తీసుకోకుండా ఆడిన ఈ ఇద్దరు బ్యాటర్లు.. మిగతా బౌలర్లను మాత్రం ఓ ఆట ఆడుకున్నారు. ఇక తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ పై భారత్ ఓడిపోవడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. టీమిండియా చివరిగా ఆడిన 9 టెస్ట్ లలో 7 మ్యాచ్ లలో ఓడిపోవడం కూడా ఇందుకు కారణం. దీంతో గౌతమ్ గంభీర్ పై మాజీ ఆటగాళ్లు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
గంభీర్ పై ట్రోలింగ్:
న్యూజిలాండ్ తో స్వదేశంలో మూడు టెస్టులు, ఆస్ట్రేలియా పై మూడు టెస్ట్ లు, ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఒక టెస్ట్ మ్యాచ్ లో భారత్ పరాజయం పాలైంది. దీంతో కోచ్ గౌతమ్ గంభీర్ పై చాలా ఒత్తిడి నెలకొంది. రెడ్ బాల్ క్రికెట్ లో అతడు కోచ్ గా తన మార్క్ ను ఇప్పటివరకు చూపించలేకపోయాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఆశించిన ఫలితాలు రాకపోతే.. గంభీర్ స్తానం ప్రశ్నార్దకంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.
Also Read: Shuman Gill: వివాదంలో గిల్.. Nike కంపెనీ టీషర్ట్ వేసుకొని అడ్డంగా దొరికిపోయాడుగా!
ఎందుకంటే ఇప్పటివరకు గౌతమ్ గంభీర్ కోరిన ప్రతి దాన్ని బీసీసీఐ, సెలక్టర్లు ప్రతిదాన్ని అందించారు. అతడు కోరిన ఆటగాళ్లను ఎంపిక చేశారు. అయినప్పటికీ ఫలితాలు అనుకూలంగా రాని నేపథ్యంలో అతడికి ఇబ్బందులు తప్పక పోవచ్చు అని చెబుతున్నారు. ఇలా టెస్టుల్లో వరుస ఓటములపై నెటిజెన్లు కూడా గౌతమ్ గంబీర్ ని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.
“మ్యాచ్ లు గెలవాలంటే మంచి బౌలర్స్ ఉండాలి అంకుల్” అంటూ గంభీర్ పై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో “సామాన్లు బాగుండాలి ఆంటీ” అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఇదే డైలాగ్ ని గౌతమ్ గంభీర్ విషయంలో వాడుతూ.. గంభీర్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండవ టెస్ట్ లో భారత జట్టును గెలుపు బాట పట్టించి.. ఈ ట్రోల్స్ కి గంభీర్ చెక్ పెడతాడా..? లేదా..? అన్నది వేచి చూడాలి.