BigTV English

Sania Mirza: టాలీవుడ్‌ హీరోను పెళ్లి చేసుకోబోతున్న సానియా మీర్జా.. షమీని కాదని మరీ ?

Sania Mirza: టాలీవుడ్‌ హీరోను పెళ్లి చేసుకోబోతున్న సానియా మీర్జా.. షమీని కాదని మరీ ?

Sania Mirza: భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన హైదరాబాద్ కి చెందిన సానియా మీర్జా అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ గా ఎదిగి ఎన్నో రికార్డులు సృష్టించింది. టెన్నిస్ స్టార్ గా 15 ఏళ్ల పాటు తన కెరీర్ ని కొనసాగించిన సానియా మీర్జా{Sania Mirza}.. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో అవమానాలను, వివాదాలను ఎదుర్కొంది. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని వివాహం చేసుకొని అప్పట్లో దారుణ ట్రోలింగ్ కి గురైంది.


Also Read: Mahvash – Chahal: చాహల్ తో రిలేషన్‌.. సంచలన పోస్ట్‌ పెట్టిన RJ మహ్వాష్ !

14 సంవత్సరాల క్రితం షోయబ్ మాలిక్ ని వివాహం చేసుకుంది సానియా. 2010 ఏప్రిల్ 12వ తేదీన వీరిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరి వివాహం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగగా.. రిసెప్షన్ మాత్రం పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో ఘనంగా జరిగింది. అయితే అప్పటికే షోయబ్ మాలిక్ కి అది రెండవ వివాహం. ఇక షోయబ్ – సానియా జంటకు 2018లో ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు. రెండు సంవత్సరాల పాటు సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితంలో 2020లో విభేదాలు ప్రారంభమయ్యాయి.


షోయబ్ మాలిక్ సనా జావిద్ తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో కొంతకాలం వేర్వేరుగా ఉన్న ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక 2024 జనవరిలో పాకిస్తాన్ నటి సనా జావిద్ ని షోయబ్ మాలిక్ మూడవ పెళ్లి చేసుకున్నాడు. అయితే సనా జావిద్ కి కూడా ఇది రెండవ పెళ్లి. ఆమె 2020 వ సంవత్సరం అక్టోబర్ లో పాకిస్తానీ యాక్టర్, సింగర్ ఉమైర్ జస్వల్ ని పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోయింది.

ఇక షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్న అనంతరం సానియా మీర్జా వారి విడాకుల విషయాన్ని వెల్లడించింది. షోయబ్ మాలిక్ ప్రవర్తన నచ్చక సానియా మీర్జానే అతడికి విడాకులు ఇచ్చిందని ఆమె తండ్రి ఇమ్రాన్ మిర్జా వెల్లడించారు. అయితే ఇప్పుడు సానియా మీర్జా రెండవ పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Also Read: SA20 League: లక్ అంటే ఇదే.. అభిమాని అద్భుత క్యాచ్.. రూ.90 లక్షల రివార్డ్

ఓ తెలుగు హీరోతో సానియా మీర్జా డేటింగ్ చేస్తుందని టాలీవుడ్ వర్గాలలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఆ టాలీవుడ్ హీరో ఎవరు..? అనే చర్చ సాగుతుంది. అయితే సానియా మీర్జా మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. అయితే సానియా మీర్జా పెళ్లి పుకార్లపై త్వరలోనే అధికారిక క్లారిటీ రావచ్చు అని అందరూ భావిస్తున్నారు. ఇటీవల ఇండియన్ క్రికెటర్ మహమ్మద్ షమీతో షానియా మీర్జా పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కానీ అవన్నీ పుకార్లేనని ఆ తర్వాత తేలిపోయింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×