SA20 League: క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య ఎన్నో దేశాలు తమ దేశంలోని క్రికెట్ జట్టును ఏర్పాటు చేసి అంతర్జాతీయ క్రికెట్ లో రాణించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే క్రికెట్ లో ఏ చిన్న సంఘటన జరిగినా అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇప్పటివరకు క్రికెట్ మ్యాచ్ లలో ఎంతో మంది ఆటగాళ్లు అద్భుతమైన విన్యాసాలు చేశారు.
Also Read: Big Bash league: లైవ్ మ్యాచ్‌లో ఘోరం.. బంతి తగిలి పక్షి గిలగిలా కొట్టుకొని !
అద్భుతమైన క్యాచ్ లు అందిపుచ్చుకున్న వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ గా మారాయి. అద్భుతమైన క్యాచ్ లతో ఆటగాళ్లు మ్యాచ్ ని మలుపు తిప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కొంతమంది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, మంచి క్యాచ్ లు పట్టినందుకు రివార్డ్ లు కూడా అందుకున్నారు. అయితే ఇప్పుడు మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ ప్రేక్షకుడు ఓ క్యాచ్ పట్టి కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇందుకు కేన్ విలియమ్ సన్ కారణమయ్యాడు.
అసలేం జరిగిందంటే.. సౌత్ ఆఫ్రికా టీ-20 లీగ్.. SA 20 మూడవ సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్ లోని రెండవ మ్యాచ్ డర్బన్ సూపర్ జాయింట్స్ – ప్రిటోరియా క్యాపిటల్ మధ్య జరిగింది. రూ.7 వేలు ఖర్చు చేసి ఓ అభిమాని ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. డర్బన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో డర్బన్ సూపర్ జెంట్స్ మొదట బ్యాటింగ్ కి దిగింది. అయితే న్యూజిలాండ్ దిగ్గజా క్రికెటర్ కేన్ విలియమ్ సన్ (60) అద్భుతమైన హాఫ్ సెంచరీ తో మెరిశాడు.
జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. దీంతో డర్బన్ సూపర్ జెంట్స్ టీం 209 పరుగులు చేసింది. విలియమ్సన్ తన జట్టుకు మంచి స్కోర్ ని అందించడమే కాదు.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానికి కూడా ఊహించని విధంగా సహాయం చేశాడు. ఇన్నింగ్స్ 17 ఓవర్ మూడవ బంతికి విలియమ్ సన్ స్లాగ్ స్వీప్ ఆడి గాలిలోకి భారీ షాట్ కొట్టాడు. దీంతో బంతి నేరుగా డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీ బయటికి వెళ్ళింది.
అక్కడ సీట్లలో కూర్చున్న ప్రేక్షకులు బంతిని క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిలో ఓ ప్రేక్షకుడు అద్భుతమైన స్టైల్ లో ఒంటి చేతితో ఈ క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వెంటనే అతడి చుట్టూ ఉన్న ఆడియన్స్ కేరింతలు కొడుతూ అభినందించారు. దీంతో అతడికి జాక్ పాట్ తగిలింది. ఒక రొటీన్ సిక్స్ అతడి జీవితాన్నే మార్చేసింది.
Also Read: Champions Trophy: పాక్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ఔట్..రూ. 500 కోట్లు నష్టం ?
ఈ క్యాచ్ పట్టినందుకు మ్యాచ్ నిర్వాహకులు ఆ ప్రేక్షకుడికి 2 మిలియన్ ర్యాండ్ అందించారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.90 లక్షలు అన్న మాట. అయితే SA 20 లో క్రికెటర్లకు మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా ప్రైజ్ మనీ ఇస్తుంటారు నిర్వాహకులు. క్యాచ్ ఏ మిలియన్ పేరిట దీనిని నిర్వహిస్తుంటారు. ఈ సీజన్ లో ఇది రెండవ క్యాచ్ మాత్రమే. అందుకే ఇక్కడ మ్యాచ్ లు చూసేందుకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
Super catch alert in the stands! 🚨#DurbanSuperGiant‘s #KaneWilliamson goes berserk as he smashes a colossal six 😮💨
Keep watching the #SA20 LIVE on Disney + Hotstar, Star Sports 2 & Sports18-2 | #DSGvPC pic.twitter.com/KwiTpo4yPa
— JioCinema (@JioCinema) January 10, 2025