Mahvash – Chahal: టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ తో ( Yuzvendra Chahal ) రిలేషన్ ఉన్నట్లు వస్తున్న వార్తలపై RJ మహ్వాష్ స్పందించింది. అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. తప్పుడు వార్తలు రాయకండి అంటూ ఫైర్ అయింది టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ స్నేహితురాలు RJ మహ్వాష్ ( RJ Mahvash ). టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ ( Dhanashree Verma ) మధ్య విభేదాలు ఉన్నాయని… త్వరలోనే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
Also Read: SA20 League: లక్ అంటే ఇదే.. అభిమాని అద్భుత క్యాచ్.. రూ.90 లక్షల రివార్డ్
గత వారం రోజుల నుంచి చాహల్ అలాగే ధనశ్రీ వర్మ విడాకుల గురించి మాత్రమే వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ధన శ్రీ వర్మ చేష్టల కారణంగా విసిగిపోయిన చాహల్… ఆమెకు దూరంగా ఉంటున్నారట. అంతేకాదు సోషల్ మీడియాలో ధనశ్రీ వర్మ కు సంబంధించిన ఫోటోలు కూడా యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) డిలీట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే… ఈ నేపథ్యంలోనే… యుజ్వేంద్ర చాహల్ అలాగే ధనశ్రీ వర్మ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
కానీ ఇప్పటివరకు ఈ ఇద్దరు సెలబ్రిటీలు విడాకులపై నేరుగా స్పందించలేకపోయారు. పరోక్షంగా… కొన్ని సామెతలు చెప్పి ఆ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీక్ అనే కొరియోగ్రాఫర్ తో…. చాహల్ భార్య ధనశ్రీ వర్మ తిరుగుతున్న నేపథ్యంలోనే.. విడాకుల అంశం తెరపైకి వచ్చినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అలాగే శ్రేయస్ అయ్యర్ తో గతంలో చాహల్ ( Yuzvendra Chahal ) భార్య ధనశ్రీ వర్మ… క్లోజ్ గా ఉండడం కూడా.. విడాకులకు కారణమని మరికొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇక కొంతమంది మాత్రం చాహల్… వేరే అమ్మాయితో తిరగడం కారణంగానే విడాకుల అంశం తెరపైకి వచ్చినట్లు చెబుతున్నారు. మొత్తానికి… ఈనెల చివరిలోపు యుగేంద్ర చాహల్ అలాగే ధన శ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారని… కంటెంట్ ను తెగ వాడుకుంటున్నాయి మీడియా సంస్థలు అలాగే సోషల్ మీడియా సంస్థలు.
Also Read: Big Bash league: లైవ్ మ్యాచ్‌లో ఘోరం.. బంతి తగిలి పక్షి గిలగిలా కొట్టుకొని !
అయితే ఇలాంటి నేపథ్యంలో చాహల్ ప్రియురాలుగా తెరపైకి వచ్చిన…RJ మహ్వాష్ ( RJ Mahvash )… తాజాగా స్పందించారు. చాహల్ ( Yuzvendra Chahal ), ధనశ్రీ విడిపోతున్న… వేరే అమ్మాయితో చాహల్ ఉన్న ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫోటో RJ మహ్వాష్… అని తెలుస్తోంది. ఇక తనపై వార్తలు రావడం పై…RJ మహ్వాష్ ( RJ Mahvash ) తాజాగా స్పందించారు. చాహల్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొంది. అవన్నీ ఊహాగానాలు మాత్రమే అని తెలిపింది. ఒక అబ్బాయి అలాగే అమ్మాయి తిరిగితే అది డేటింగ్ అవుతుందా? అని నిలదీసింది RJ మహ్వాష్. రెండు మూడు రోజుల నుంచి కుటుంబ సభ్యులతో చాలా హ్యాపీగా ఉన్నాను… అనవసరంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకండి అని RJ మహ్వాష్ ( RJ Mahvash ) ఫైర్ అయింది.
‘ക്ഷമിക്കുന്നതിന് ഒരതിരുണ്ട്’; ചഹലുമായുള്ള ‘പ്രണയ വാര്ത്ത’യില് പൊട്ടിത്തെറിച്ച് മെഹ്വാഷ് https://t.co/SOlyixN4iz
— Manorama News (@manoramanews) January 11, 2025