BigTV English

Mega Vs Allu: మలయాళ హీరోకి బన్నీ సపోర్ట్.. మళ్లీ మొదలైన వార్..!

Mega Vs Allu: మలయాళ హీరోకి బన్నీ సపోర్ట్.. మళ్లీ మొదలైన వార్..!

Mega Vs Allu:అల్లు అర్జున్ (Allu Arjun) గురించి సోషల్ మీడియాలో తాజాగా మరో చర్చ జరుగుతోంది. అదేంటంటే..అల్లు అర్జున్ ఓ మలయాళ హీరోని అభినందించడంతో సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు వార్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మరి ఇంతకీ అల్లు అర్జున్ ఏ మలయాళ హీరోని అభినందించారు.? ఎందుకు సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా వార్ స్టార్ట్ అయింది? అనేది ఇప్పుడు చూద్దాం.


అల్లు వర్సెస్ మెగా..

గత ఏడాది ఏపీ ఎన్నికలు జరిగినప్పటి నుండి మెగా వర్సెస్ అల్లు అనేలా చాలామంది సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ ట్వీట్ లతోనే కొట్టుకున్నంత పని చేస్తున్నారు. అయితే వీరి మధ్య ఈ గొడవ సాగుతున్న తరుణంలో పుష్ప -2 విడుదలైంది.ఇక ఈ సినిమా చూసి మెగా ఫ్యాన్స్ అందరూ నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. కానీ ఎవరు ఎన్ని చేసినా మంచి సినిమాను ఆపలేరు అన్నట్లు.. ఈ సినిమా ఇప్పటికే రూ.2000 కోట్ల కలెక్షన్స్ కు చేరువలో ఉంది. ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత భారీ కలెక్షన్లు సాధించిన సినిమాల్లో టాప్ 2 ప్లేస్ లో పుష్ప 2 ఉంది. అయితే తాజాగా రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా టాక్ బాలేనప్పటికీ కలెక్షన్స్ మాత్రం భారీగా వచ్చినట్టు చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. దాంతో ఇవి ఫేక్ కలెక్షన్స్ అంటూ చాలామంది కొట్టి పారేస్తున్నారు.


మార్కో సినిమాపై బన్నీ ప్రశంసలు..

ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా మలయాళ హీరో ఉన్ని ముకుందన్ (Unni mukundan)నటించిన ‘మార్కో’ సినిమాని అల్లు అర్జున్ చూసినట్టు.. మార్కో మూవీ యూనిట్ అఫీషియల్ గా ఒక పోస్టర్ వేశారు. మార్కో మూవీ చూసి.. చిత్ర యూనిట్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందించినట్టు.. వాళ్ళు తెలిపారు. ఇక ఉన్ని ముకుందన్ అంటే చాలామంది తెలుగు వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఈయన తెలుగులో అనుష్క నటించిన భాగమతి సినిమాలో అనుష్క లవర్ పాత్రలో నటించారు. అలాగే ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీలో నటుడు మోహన్ లాల్ కొడుకుగా నెగిటివ్ పాత్రలో నటించి, తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.

మళ్లీ మొదలైన వార్..

అలాంటి ఉన్ని ముకుందన్ నటించిన మార్కో మూవీ గత ఏడాది డిసెంబర్ 20న విడుదలై, హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో అల్లు అర్జున్ ప్రశంసించడంతో.. సోషల్ మీడియాలో మళ్ళీ రచ్చ స్టార్ట్ అయింది. గేమ్ ఛేంజర్ సినిమా గురించి కనీసం పోస్టు కూడా చేయని అల్లు అర్జున్ , మలయాళ హీరో సినిమా అయితే చూశారా అని, మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని తిట్టిపోస్తున్నారు. కానీ అల్లు ఫ్యాన్స్ ఊరుకుంటారా.. మీ హీరో కంటే మా హీరో సినిమా ముందు విడుదలైంది.మీ హీరో అప్పుడేం చేశాడు. అప్పుడు మీ హీరో ట్వీట్ చేస్తే ఇప్పుడు బన్నీ సపోర్ట్ చేసేవాడు కదా అంటూ మెగా ఫ్యాన్స్ చేసే కామెంట్లను తిప్పి కొడుతున్నారు. మళ్లీ మొదలైన ఈ వారం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×