E-Paper
Advertisement

U19 Asia Cup 2025: టాస్ గెలిచిన టీమిండియా..మ‌రోసారి పాకిస్తాన్ ను అవ‌మానించిన ఆయుష్..తుది జ‌ట్లు ఇవే

U19 Asia Cup 2025: టాస్ గెలిచిన టీమిండియా..మ‌రోసారి పాకిస్తాన్ ను అవ‌మానించిన ఆయుష్..తుది జ‌ట్లు ఇవే
Advertisement

U19 Asia Cup 2025:  ఆసియా కప్ 2025 అండర్ 19 ( ACC Mens U19 Asia Cup 2025 ) ఫైనల్ మ్యాచ్ కు  సర్వం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో అండర్ 19 టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( India U19 vs Pakistan U19, Final ) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అయితే కాసేపటికి క్రితమే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన అండర్ 19 టీమ్ ఇండియా జట్టు, మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. వన్డే మ్యాచ్ కాబట్టి, సెకండ్ బౌలింగ్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. సాయంత్రానికి పొగ మంచు పడే ప్రమాదం ఉంటుంది. అందుకే మొదట బౌలింగ్ చేయాలని అండర్ 19 టీం నిర్ణయం తీసుకుంది. దీంతో ముందుగా అండర్ 19 పాకిస్తాన్ బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా మరోసారి అండర్ 19 పాకిస్తాన్ పరువు తీసింది టీమిండియా. బీసీసీఐ నిర్ణయం ప్రకారం మరోసారి పాకిస్తాన్ కెప్టెన్ ఫరహాన్ యూసఫ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు టీమిండియా అండర్ 19 కెప్టెన్ ఆయుష్ మాత్రే. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

Also Read:  T20 World Cup 2026 India Squad: గిల్ పీడ విరగడైంది.. టి20 ప్రపంచ కప్ 2026 ఆడే టీమిండియా జట్టు ఇదే

మ‌రోసారి పాకిస్తాన్ ను అవ‌మానించిన ఆయుష్

Advertisement

ఆసియా కప్ 2025 అండర్ 19 ( ACC Mens U19 Asia Cup 2025 ) ఫైనల్ మ్యాచ్ సంద‌ర్భంగా టాస్ గెలిచాడు ఆయూష్ మాత్రే. అనంత‌రం బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. ఆ త‌ర్వాత పాకిస్తాన్ కెప్టెన్ ప‌ర‌హాన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వ‌లేదు. ఇక ఈ మ్యాచ్ ను సోనీ స్పోర్ట్స్‌, సోనీ లీవ్ లో ఉచితంగానే చూడ‌వ‌చ్చు. ఇక ఈ మ్యాచ్ లో ఆయూష్ మాత్రే, 14 ఏళ్ల వైభ‌వ్ సూర్య వంశీ కాస్త క్లిక్ అయితే, టీమిండియా గెల‌వ‌నుంది. అయితే, ఈ మ్యాచ్ వ‌ర్షం, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ర‌ద్దు అయితే, పాయింట్ల పట్టిక ప్ర‌కారం టీమిండియా విజ‌యం సాధించ‌నుంది.

 

ఇండియా U19 వ‌ర్సెస్ పాకిస్థాన్ U19 ( India U19 vs Pakistan U19, Final ) 

Advertisement

ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆయుష్ మ్హత్రే (కెప్టెన్‌), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(w), కనిష్క్ చౌహాన్, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్

పాకిస్థాన్ U19 (ప్లేయింగ్ XI): సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్‌), హంజా జహూర్ (w), హుజైఫా అహ్సన్, నికాబ్ షఫీక్, మహ్మద్ షయాన్, అలీ రజా, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయామ్

Also Read: Team India Squad: న్యూజిలాండ్ తో ఆడే టీం ఇండియా జట్టు ఇదే.. గిల్ పై వేటు, అక్షర్ పటేల్ కు బంపర్ ఆఫర్

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×