BCCI-IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. మార్చి 28వ తేదీన ప్రారంభం కాబోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ జూన్ మొదటి వారం వరకు కొనసాగనుంది. దాదాపు రెండు నెలల పాటు కొనసాగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India) కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇకపైన జబ్బలు కనిపించేలా జెర్సీలు ధరించకూడదని ప్లేయర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాక్టీస్ చేసే క్రమంలో ఇలాంటి జెర్సీలు ( Jersy) వేస్తే, కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బీసీసీఐ ( BCCI rules) కొత్త రూల్స్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ ఆడే ప్లేయర్లు క్రమశిక్షణగా ఉండాలన్న నేపథ్యంలో ఈ రూల్స్ అమలు చేయనుంది బీసీసీఐ. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి క్రమంలో జబ్బలు కనిపించేలా జెర్సీలు ధరించకూడదని ఆదేశాలు జారీ చేసింది. అలాగే మ్యాచ్ పూర్తయిన తర్వాత పోస్టు మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా కూడా స్లీవ్ లెస్ జెర్సీలు ధరిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే తమ ఆదేశాలను కాదని మొదటి సారి తప్పిదం చేస్తే వార్నింగ్ తో వదిలేస్తామని తెలిపింది. రెండోసారి అదే తప్పిదం చేస్తే మ్యాచ్ ఫీజులో కోత విధించడం గ్యారంటీ అని హెచ్చరించింది.
మూడోసారి కూడా తప్పు జరిగితే ఒక మ్యాచ్ ఆడకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది బీసీసీఐ ( BCCI). అలాగే డ్రెస్సింగ్ రూముల్లోకి తమ భార్యలు అలాగే లవర్స్ ను తీసుకు రాకూడదని వెల్లడించింది. ఫీల్డ్ లోకి కూడా వాళ్లను తీసుకురాకూడదని తెలిపింది. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఆరెంజ్ అలాగే పర్పుల్ క్యాప్ హోల్డర్లు, మ్యాచ్ లో కనీసం రెండు ఓవర్లు పూర్తి అయ్యే వరకు కచ్చితంగా వాటిని ధరించాలి అంటూ కొత్త కండిషన్ తెరపైకి తీసుకువచ్చింది. ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన బస్సులోనే ప్రయాణించాలని, ప్రత్యేకంగా వాహనాలలో వెళ్ళకూడదని వెల్లడించింది. అలాగే ఈ బస్సుల్లోకి కుటుంబ సభ్యులను అస్సలు ఎక్కించకూడదని వివరించింది. ఇక రాత్రి వేళల్లో ప్రాక్టీస్ మ్యాచ్ జరిగితే మూడున్నర గంటలు మించి సాగకూడదని తెరపైకి మరో రూల్ తీసుకువచ్చింది.
🚨 THE BCCI GUIDELINES FOR IPL TEAMS. 🚨
❌ match day practices are not allowed.
❌ Floppies and sleeveless jerseys won’t be allowed in the Post match presentation.
⚠️ A warning will be served on the 1st breach of wearing Floppies and sleeveless.
💰 A financial penalty on… pic.twitter.com/1VDHhPBsCy
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2026