Vaibhav Suryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Rajasthan Royals vs Lucknow Super Giants ) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ ఏకంగా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎప్పటిలాగే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi) ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌలర్లు అంటే ఏమాత్రం దయ లేకుండా ప్రవర్తించాడు. ఒక్క బౌలర్ ను కూడా వదలకుండా నరకం మీనింగ్ రాయించాడు వైభవ్ సూర్యవంశీ.
అయితే ఈ క్రమంలోనే 23 బంతుల్లో వైభవ్ సూర్య వంశి అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత తన వేళ్ళతో A సింబల్ (Vaibhav Suryavanshi’s A Symbol Celebration) చూపిస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో ఈ సింబల్స్ వెనుక కారణమేంటని సోషల్ మీడియాలో అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది తన ప్రియురాలి గురించి ఆ సింబల్ చూపించాడని అంటుంటే..టీమిండియా A టీం గురించి ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నాడని మరికొంతమంది అంటున్నారు. మొత్తానికి వైభవ్ చేసిన ఈ సెలబ్రేషన్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య నిన్న జైపూర్ వేదికగా 64వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 220 పరుగుల టార్గెట్ పెట్టింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో వైభవ్ సూర్యవంశీ మొదటి నుంచి దూకుడుగా ఆడాడు. 23 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అయితే అర్థ సెంచరీ నమోదు చేసుకున్న తర్వాత A సింబల్ చూపిస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే ఈ సింబల్ వెనుక అసలు కారణం మ్యాచ్ తర్వాత రివీల్ చేశాడు వైభవ్ సూర్యవంశీ. తన అమ్మకు ఈ ఇన్నింగ్స్ అంకితం చేశానని…ఆమె అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు వైభవ్. తనకు ఎలాంటి లవర్ లేదని.. అమ్మ కోసమే తన బ్యాటింగ్ అంకితం చేశానని వివరించాడు. అందుకే A సింబల్ చూపిస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నానని క్లారిటీ ఇచ్చాడు వైభవ్. ఈ నేపథ్యంలో వైభవ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా 30నిమిది బంతుల్లో 93 పరుగులు చేశాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఇందులో 10 సిక్సర్లతో పాటు ఏడు బౌండరీలు ఉన్నాయి. 244.74 స్ట్రైక్ రేట్ తో ఇరగదీశాడు.
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ తల్లి పేరు ఆర్తి సూర్య వంశీ. ఇటీవలే ఆమె ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆమె హౌస్ వైఫ్. తన కొడుకు కోసం ఎన్నో త్యాగాలు చేసింది ఆర్తి సూర్య వంశీ. ఉదయం 3 గంటలకే నిద్రలేచి, వైభవ్ సూర్య వంశీ క్రికెట్ ప్రాక్టీస్ కోసం వెళ్లే కంటే ముందు భోజనం ఏర్పాటు చేసేది. అన్ని విధాల వైభవ్ సూర్యవంశీకి సహకరించేది. ఆమె కష్ట పడిన నేపథ్యంలో వైభవ్ ఈ స్థాయికి వచ్చాడని చెప్పవచ్చు.
VAIBHAV SURYAVANSHI'S INSTAGRAM POST FOR HIS MOTHER. 🥹♥️ pic.twitter.com/bfDKwh3zu5
— Tanuj (@ImTanujSingh) May 9, 2026
?igsh=OHU4bDM4N3V3cXdp
What's Vaibhav Suryavanshi signalling with his fifty celebration? 🤔 pic.twitter.com/aouS82U1DW
— Cricbuzz (@cricbuzz) May 19, 2026