E-Paper
Advertisement

తెలంగాణ రైతన్నలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్.. మూడేళ్ల దాకా పైసలు ఫ్రీ..!

తెలంగాణ రైతన్నలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్.. మూడేళ్ల దాకా పైసలు ఫ్రీ..!
Advertisement

Bamboo Farming: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో వెదురు సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో 7లక్షల ఎకరాల్లో వెదురు సాగు చూసి రైతులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వెదురు ఉత్పత్తులను థర్మల్ ప్లాంట్లు సైతం వినియోగించాలని భావిస్తున్నాయి. అదే విధంగా రాష్ట్రంలో సైతం వెదురు కొరతను నివారించాలని, రైతులకు ఉపాధి మెరుగు పర్చాలని, సెర్ప్ అధికారులు హార్టికల్చర్ , ఫారెస్టు శాఖలతో కలిసి ముందుకు సాగునున్నాయి. వెదురు సాగుచేసే రైతులకు ఉచితంగా మొక్కలతో పాటు 3 ఏళ్ల పాటు మెయింటెన్స్ ఖర్చును సైతం ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద ఇస్తుంది.

ఐదు జిల్లాల్లో వెదురు సాగు

రాష్ట్రంలో సాంప్రదాయ పంటల సాగుతో నష్టపోతున్న రైతులకు ప్రత్యామ్నాయ లాభసాటి మార్గాలను చూపించేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పర్యావరణహితమైన, నిరంతర ఆదాయాన్నిచ్చే వెదురు (బంబూ) సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో వెదురు సాగు విజయవంతంగా కొనసాగుతుండగా, తాజాగా మరో మూడు జిల్లాలకు దీనిని విస్తరించాలని నిర్ణయించింది. నిర్మల్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వెదురు సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు సమగ్ర ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ జిల్లాల్లో వెదురు సాగు ప్రాజెక్టును త్వరలోనే పట్టాలెక్కించబోతున్నట్లు అధికారులు తెలిపారు.

ఉచితంగా మొక్కలు.. ఉపాధి హామీ అండ!

Advertisement

వెదురు సాగుకు ఎంపిక చేసిన రైతులకు ప్రభుత్వం అండగా నిలవనుంది. అర్హులైన ప్రతి రైతుకు ఉచితంగా 60 వెదురు మొక్కలను పంపిణీ చేయనున్నారు. మొక్కలు నాటినప్పటి నుంచి అవి పెరిగే వరకు నిరుపేద రైతులకు భారం కాకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మూడేళ్ల పాటు ఉచితంగా మెయింటెనెన్స్ (రక్షణ, నీటి వసతి కల్పన వ్యయం) సదుపాయాన్ని కల్పించనున్నారు. మొక్కలు చనిపోతే వాటి స్థానంలో రీ ప్లాంటేషన్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది.మొక్క మొక్కకు మధ్య గ్యాప్ 15X15అడుగుల దూరం ఉండేలా నాటనున్నారు. సాకుకు ముందు భూమిలో కెమికల్ ట్రీట్ మెంట్ సైతం చేయనున్నారు. రైతులపై ఎలాంటి భారం పడనుంది. ఉత్సాహంగా సాకుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Also Read: తెలంగాణ సర్కార్ తెచ్చిన రూల్స్‌తో ఆఫీసర్లకు చుక్కలు.. జీవో విడుదల..!

5 ఏళ్లలో చేతికి పంట.. మార్కెట్ భరోసా!

Advertisement

వెదురు నాటిన ఐదేళ్లలో మొదటి కటింగ్ (కోత)కు వస్తుంది. ఒకసారి కోత ప్రారంభమైతే, దాదాపు 30 నుంచి 40 ఏళ్ల పాటు నిరంతరాయంగా ఈ పంట ద్వారా రైతులు ఆదాయం పొందవచ్చు. అయితే, పంట పండించిన తర్వాత ఎక్కడ అమ్ముకోవాలనే ఆందోళన రైతులకు అవసరం లేకుండా ప్రభుత్వమే ముందస్తు చర్యలు చేపట్టింది. వెదురును కొనుగోలు చేసేందుకు వీలుగా మార్కెట్ సదుపాయాన్ని సైతం ప్రభుత్వమే కల్పించనుంది.కాగితపు పరిశ్రమలు, చేతివృత్తుల కేంద్రాలు, వాణిజ్య అవసరాల సంస్థలతో అనుసంధానం చేసి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా సెర్ప్ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఒక్కో వెదురు కర్ర(బొంగు)కు రూ.130 నుంచి 180 వరకు ధర రానున్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటికే 5 జిల్లాల్లో సక్సెస్..

రాష్ట్రంలో వెదురు సాగు ప్రయోగం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే తెలంగాణలోని ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా వెదురు సాగు విజయవంతంగా సాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసీఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వెదురు సాగు చేపట్టారు. అక్కడ లభించిన సానుకూల ఫలితాలు, రైతుల నుంచి వచ్చిన ఆదరణను బట్టే.. ఇప్పుడు నిర్మల్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలకు దీనిని విస్తరిస్తున్నారు. ఈ మూడు జిల్లాల్లో ఐకేపీ, గ్రామసమాఖ్య సంఘాల సమావేశాలు నిర్వహించి రైతులను ఎంపిక చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు వెదురు సాగు ఒక అద్భుతమైన అవకాశం అని సెర్ప్ అధికారులు పేర్కొంటున్నారు. నిర్మల్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని భూములు, వాతావరణం వెదురు సాగుకు అనుకూలమని, సీఎం ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో మొక్కల పంపిణీ జరుగుతుందని వెల్లడించారు.

ఎకరాకు 10వేల లీటర్లు

4కేజీల వెదురు నుంచి 1.2 లీటర్ల ఇథనాల్ తీయొచ్చు. ఎకరాకు 10వేల లీటర్ల ఇథనాల్ తీయొచ్చని అధికారులు వెల్లడించారు. వెదురులో 10 రకాలుంటే తెలంగాణ వాతావరణంలో బ్యాంబుసా, బాల్క్ కోవ బ్యాంబు, బ్యాంబుసా ట్యూల్డా, డెంట్రో కాలం, న్యూటన్ బ్యాంబు సాగు చేస్తే వీటి ద్వారా బ్రష్ లు, దువ్వెనలు, రేజర్లు, ఫర్నీచర్, అలంకరణ వస్తువులకు మార్కెట్లో డిమాండ్ ఉంటుందని అధికారులు తెలిపారు.

త్వరలోనే..

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు ఈ వెదురు సాగు ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుంది. పంటల మార్పిడిలో భాగంగా వెదురును ఎంచుకునే రైతులకు ఇదొక సువర్ణావకాశమని, అటు ఉపాధి హామీ లబ్ధి, ఇటు భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం దీని ద్వారా సాధ్యమవుతుందని సెర్ప్ ఉన్నతాధికారులు తెలిపారు. త్వరలోనే ఈ మూడు జిల్లాల్లోని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది.

Also read: రివేంజ్ నుంచి ఇంటెన్స్ థ్రిల్లర్ల వరకు… ఈ వీకెండ్ కు బెస్ట్ హిందీ మూవీస్ ఇవే

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×