Big Stories

Travis Head Makes History In IPL: ట్రావిస్ హెడ్.. విధ్వంసం 39 బంతుల్లో సెంచరీ.. రికార్డు బ్రేక్

Travis Head Century in SRH vs RCB Match(Latest sports news today): హైదరాబాద్ సన్ రైజర్స్ కి కెప్టెన్ కమిన్స్ ఏం మత్తు మందు పెట్టాడో తెలీదు. బ్యాటర్లు పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు. వాడు వీడని లేదు. ఎలాంటి బౌలర్లనైనా ఊచకోత కోసి పారేస్తున్నారు. ముఖ్యంగా ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన నాలుగో బ్యాటర్ గా నిలిచాడు.

- Advertisement -

20 బంతుల్లో ఆఫ్ సెంచరీ చేసిన హెడ్, తర్వాత కేవలం 19 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. మొత్తం 39 బంతుల్లో సెంచరీ చేసిన హెడ్ కన్నా ముందు క్రిస్ గేల్(30), యూసఫ్ పఠాన్(37), డేవిడ్ మిల్లర్(38) ఉన్నారు.

- Advertisement -

ట్రావిస్ హెడ్ సెంచరీలో 9 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. మొత్తానికి 41 బంతుల్లో 102 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యంత వేగంగా శతకం నమోదు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.

Also Read: వారి వల్లే ఓటమి పాలయ్యాం: ఆర్సీబీ కెప్టెన్

తను అందించిన పికప్ ని తర్వాత వాళ్లు అందిపుచ్చుకున్నారు. మరింత రెట్టించిన ఉత్సాహంతో ఆడారు. ఇరగదీసి వదిలేశారు. ఆర్సీబీ బౌలింగుని ఊచకోత కోశారు.  విల్ జాక్స్, రిస్ టోప్లీ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, విజయ్ కుమార్ వైశాఖ్ ఎవ్వరినీ వదల్లేదు. అందరికీ చుక్కలు చూపించారు. ఒకొక్క బాల్ స్టేడియం అంత ఎత్తు ఎగిరాయి. ప్రతీ ఓవర్‌లో భారీ సిక్సర్లు నమోదయ్యాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్  7.1 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. 15 ఓవర్లలోనే 200 పరుగుల మార్క్‌ను ధాటింది. మిగిలిన 5 ఓవర్లలో 87 పరుగులు చేసింది. మొత్తానికి 20 ఓవర్లలో 287 భారీ పరుగులు చేసింది.

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ట్రావిస్ హెడ్ .. మొన్నటి వరకు ఆర్సీబీ తరఫున ఆడాడు. అక్కడ సరిగ్గా ప్రదర్శన చేయకపోవడంతో బయటకి వచ్చాడు. హైదరాబాద్ జట్టులో చేరి, పాత జట్టుపై కనికరం లేకుండా ఆడాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News