BigTV English
Advertisement

Cantonment BJP Candidate: బీజేపీ అభ్యర్థి తిలక్, గట్టి పోటీ తప్పదా?

Cantonment BJP Candidate: బీజేపీ అభ్యర్థి తిలక్, గట్టి పోటీ తప్పదా?

Secunderabad Cantonment BJP Candidate(BJP news in telangana): ఎట్టకేలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. అన్నికోణాల్లో పరిశీలించి డాక్టర్ టీఎన్ వంశా తిలక్ పేరును ఖరారు చేసింది. తొలుత ఈ సీటు నుంచి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయడం బీజేపీకి కత్తిమీద సాముగా మారింది. రెండుసార్లు పోటీ చేసిన శ్రీగణేష్.. కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో కొత్త అభ్యర్థి ఎంపిక బీజేపీకి తలనొప్పిగా మారింది.


ఈ సీటు కోసం బీజేపీ నుంచి దాదాపు 10 మంది పోటీపడ్డారు. చివరకు అన్నికోణాల్లో పరిశీలించి చివరకు డాక్టర్ వంశా తిలక్ పేరును ఫైనల్ చేసింది. తెలంగాణకు చెందిన కమలనాథులు ఆయన పేరు హైకమాండ్‌కు ఇవ్వడం, ఓకే చేయడం చకచకా జరిగిపోయింది.

గతంలోకి వెళ్తే.. మాజీ మంత్రి సదాలక్ష్మి కుమారుడు డాక్టర్ వంశా తిలక్. ఈమె బొల్లారం ప్రాంతానికి చెందినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా పనిచేశారు. తొలి దళిత దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె భర్త నారాయణ ఎనిమిదేళ్ల కిందట పద్మశ్రీ అవార్డును అందు కున్నారు. వీరి వారసుడే డాక్టర్ వంశా తిలక్. రాజకీయాల్లోకి రావాలని ఎప్పుటి నుంచి ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే ఆయనకు సాధ్యం కాలేదు. చివరకు బీజేపీ హైకమాండ్ ఆశీస్సులతో తిలక్‌కు సీటు లభించింది. స్వతహాగా తిలక్ డాక్టర్ కావడం, పార్టీలో ఉండడం కూడా కలిసివచ్చిన అంశంగా పార్టీ నేతలు చెబుతున్నారు.


ALSO READ: రద్దీగా వైన్ షాపులు, 24 గంటలపాటు బంద్

బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన శ్రీ‌గణేష్.. ఈసారి హస్తం పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. ఈసారి కచ్చితంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య సోదరి నివేదితను అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. ఫ్యామిలీ సెంటిమెంట్ తనకు కలిసొస్తుందని నివేదిత ఆలోచన. మొత్తానికి ఈసారి పోటీ గట్టిగా ఉంటుందని ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. మే 13న లోక్‌సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది.

Tags

Related News

Iconic Bridge: హైదరాబాద్‌లో అద్భుతమైన ఐకానిక్ బ్రిడ్జ్.. టెండర్‌కు అప్రూవల్ ఇచ్చిన ప్రభుత్వం

Kalvakuntla Kavitha: హరీష్‌ను టార్గెట్ చేస్తున్న కవిత

Paddy Procurement Record: ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు.. మంత్రులు ఉత్తమ్, తుమ్మల సమీక్ష

Delhi Blast High Alert: దిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హైఅలర్ట్‌.. పలుచోట్ల ముమ్మర తనిఖీలు

Nizamabad: దందాలు మూసుకోండి.. బీజేపీ లీడర్లకు ధర్మపురి వార్నింగ్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Delhi Blast: కదులుతున్న కారులో బ్లాస్ట్.. ఉగ్రవాదులు ఎలా ప్లాన్ చేశారంటే?

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Big Stories

×