Big Stories

Du Plessis: వారి వల్లే ఓటమి పాలయ్యాం: ఆర్సీబీ కెప్టెన్

IPL 2024 RCB vs SRH:హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రెండు జట్ల మధ్య విధ్వంసం జరిగింది. హైదరాబాద్ 287 పరుగులు చేస్తే, ఆర్సీబీ కూడా తామేమి తక్కువ తినలేదన్నట్టు 262 పరుగులు చేసింది.  25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయినా సరే, స్ఫూర్తిదాయకమైన పోరాట పటిమ చూపించింది.

- Advertisement -

ఇదే విషయాన్ని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో చెప్పాడు. మా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. కాకపోతే బౌలింగ్ వీక్ గా ఉంది. బ్యాటింగ్ ఆర్డర్ బాగుంది. కాకపోతే మిడిల్ ఆర్డర్ వైఫల్యాలు వెంటాడుతున్నాయని అన్నాడు. ఈసారి ముగ్గురు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఒత్తిడి తట్టుకోలేక అయిపోయారని అన్నాడు.

- Advertisement -

బౌలర్ల విషయానికి వస్తే ఒక 30 నుంచి 40 పరుగులు కంట్రోల్ చేయవచ్చునని అన్నాడు. ఒక సిక్స్ వెళుతుంటే బౌలర్లు టెన్షన్ లోకి వెళ్లి మరింత లూజ్ బాల్స్ వేస్తున్నారని చెప్పాడు. అందువల్ల మేం బౌలింగ్ విభాగంపై దృష్టిలో పెట్టాల్సి ఉందని అన్నాడు. ఇప్పటికే రెండు మార్పులు చేశామని అన్నాడు.

Also Read: నేడు కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్

287 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేయడం అంటే, అంత  ఆషామాషీ వ్యవహారం కాదని అన్నాడు. కానీ కుర్రాళ్లు ఏం మాత్రం భయపడకుండా ఆడారని అన్నాడు. ముఖ్యంగా ఈ తరహా ఆట తీరుతో సంత్రప్తికరంగా ఉందని అన్నాడు. ఆటలో గెలుపు ఓటములు సహజమని అన్నాడు. ఓడిపోతే కచ్చితంగా బాధ ఉంటుందని అన్నాడు. అదీ కాకుండా వరుస ఓటములు కూడా కొంచెం ఇబ్బందికరమేనని అన్నాడు.

కానీ మనం అదే తలచుకుని బాధపడుతుంటే ముందు మ్యాచ్ లు ఆడలేమని అన్నాడు. ఇప్పటికి సగం మ్యాచ్ లు అయిపోయాయి. మిగిలిన మ్యాచ్ లు వరుసగా గెలవాల్సి ఉందని అన్నాడు. ఇక్కడ నుంచి గెలిస్తే టాప్ ఫోర్ లో ప్లేస్ కావచ్చునని అన్నాడు. ఇంక గెలవక తప్పని పరిస్థితుల్లోకి వెళ్లామని చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు గెలవాలంటే ఏం చేయాలనేది టీమ్ మేనేజ్మెంట్ అంతా కూర్చుని ఆలోచిస్తామని అన్నాడు.

అయితే ఆర్సీబీలో ఒకరు మాక్స్ వెల్, మరొకరు సిరాజ్ ఇద్దరినీ పక్కన పెట్టారు. నిజానికి వాళ్లిద్దరూ ఉండి ఉంటే, హైదరాబాద్ తో మ్యాచ్ గెలిచేవారని అంటున్నారు. ఎందుకంటే మాక్స్ వెల్ ఆల్ రౌండర్ అందువల్ల తను ఒక 20 పరుగులు తక్కువైనా ఇచ్చేవాడు. అలాగే సిరాజ్ ఓవర్ కి రన్ రేట్ 10 వరకు ఉంది. అందువల్ల నాలుగు ఓవర్లకి 40 ఇచ్చేవాడు. కానీ హైదరాబాద్ మ్యాచ్ లో ఇద్దరు పేసర్లు 60 పైనే పరుగులు ఇవ్వడంతో ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News